22, మార్చి 2010, సోమవారం
కెలుకుడు బ్లాగులు ఎగ్రిగేటర్ల దౌర్జన్యాలు
భావ వ్యక్తీకరణ స్వెచ్చ మీద ఉపన్యాసాలూ నీతులూ దంచేటోళ్ళు నిస్సిగ్గుగా కొంత మంది ఆడా మగా బ్లాగర్లను మాత్రం వెనకేసుకొస్తారు. దానివెనక మతలబులు ఏమిటో సదరు అగ్రిగేటర్లకే తెలియాలి. కెలుకుడు బ్లాగర్లను ఉంచాలా తీసెయాలా అని వీవెన్ పోల్ పెట్టటం ఒక పెద్ద జోక్. వారి దృష్టిలో కెలుకుడు బ్లాగర్లు అంటే కూడలి గుంపుకు చెక్కభజన చెయ్యని దమ్మున్న బ్లాగర్లు అన్నమాట.
కుల ద్వేషాన్ని నిండా నింపుకున్న ఒక బ్లాగరు ఎవరిమీద ఏమి రాసినా అతను అబ్యుదయ వాదే గాని కెలుకుడు వాది కాదని వీవెన్ గారి అభిప్రాయమా? అలాగే ఆడాళ్ళని గుంపు గట్టి రోజుకు వందల మెయిల్స్ ఇస్తూ,మొగ బ్లాగర్ల మీద విషం నింపుతూ, బ్లాగుల్ని ఆడా మగా అని రెండు వర్గాలుగా చీలుస్తూ, చివరికి వనం సభ్యుల ఇంట్లో ఈ రోజు ఏమి వంట చెయ్యాలి అనె విషయం మీద కూడా అనవసర జోక్యం చెలాయిస్తూ, తన రాతల్ని ఎవరైనా విమర్శిస్తే అది టొటల్ మహిళా లోకం మొత్తం మీద భయంకర దాడిగా చిత్రీకరించి, పబ్లిసిటీ కోసం తెగ పాకులాడే ఒక మహిళా బ్లాగర్ ని ఎవరైన విమర్శిస్తే, వెంటనే అతను కెలుకుడు బ్లాగర్ అని ముద్ర పడటం కూడా అభ్యుదయ వాదమేగా. భలే భలే....
ఇటువంటి అహంకార పూరిత పోకడలని మొదటి రోజునించే కాగడా వ్యతిరేకించి దమ్మున్న బ్లాగ్ గా, అగ్రిగేటర్లు అవసరం లేని బ్లాగ్ గా ఈ నాడు అవతరించింది. కెబ్లాస లోని అనేక ఇతర బ్లాగులు కూడా అదే స్థాయి ఉన్న బ్లాగులు గా నేడు అవతరించాయి. ఈ బ్లాగులు ఇస్తున్న హాస్యం కోసమే చాలామంది ఈ అగ్రిగేటర్ల అహంకార ధోరణిని, ఆయా బ్లాగుల్లో వస్తున్న చెత్తనీ సహిస్తున్నారు. కెలుకుడు బ్లాగులు బయటకోస్తే ఈ రెండు అగ్రిగేటర్లు ఉప్పులేని కూరలా చప్పగా తయారై త్వరలోనే కుప్పకూలి తమ అస్తిత్వాన్ని కోల్పోక తప్పదు. కాగడా సైలెంట్గా ఉన్న కొన్ని నెలలు బ్లాగు వాతావరణం ఎంత చప్పగా నిర్జీవంగా తయారైందో అందరికీ తెలుసు.
ఇంతకు ముందు వారి పెడ ధొరణులను ఎండగట్టినందుకే ధూం, కాగడా బ్లాగుల్ని కూడలి నుంచి వెలివేశారు. భరారే మీద ఒక పేరడీ, మరువం ఉష మీద ఒక పేరడీ రాసినందుకు కాగడాని హారం నుంచి కూడా బహిష్కరించారు.కాని దానివల్ల కాగడాకొచ్చిన నష్టం ఏమీ లేదు. కాగడా అవసరం అగ్రిగేటర్లకు ఉంది గాని అగ్రిగేటర్ల అవసరం కాగడాకి లేదు. ఈ వ్యాఖ్య ఇతర కెలుకుడు బ్లాగర్లకు కూడా సమానంగా వర్తిస్తుంది.
కూడలి గాంగుని విమర్శిస్తే అక్కణ్ణించి వెలివేస్తారు. హారం గాంగుని విమర్శిస్తే అక్కడా అదే అహంకార ధొరణి. భూర్జువా నిరంకుశత్వాన్ని ఎదుర్కోడానికి పుట్టిన కమ్యూనిష్టులే తిరిగి ఇంకొక భూర్జువా వర్గం అయినట్టు కూడలినుంచి వెలివేయబడిన శరత్ పెట్టిన హారం మళ్ళీ తనూ అదే బాటలో నడుస్తున్నది.
కాని శరత్ రాస్తున్న అసహజ, చదివితేనే వాంతి కొచ్చె కొన్ని పోస్టులని మాత్రం హారం అలాగే ఉంచుతున్నది. పాపం హారం అసలు శరత్ ది కదా. దాన్ని భరారే కి దానం ఇచ్చినందుకు కృతజ్ఞతగా శరత్ రాస్తున్న కొన్ని వాంతి బ్లాగులను చూచీ చూడనట్టు పోతున్నది హారం. అంతేనా భరారే.
వెరసి దమ్మున్న బ్లాగర్లు, దౌర్జన్యాన్ని,భావ బ్లాక్ మెయిలింగునీ ఎదిరించె బ్లాగర్లు బెదిరింపుల్నీ వివక్షనీ ప్రతిచోటా ఎదుర్కోంటున్నారు. ప్రతి ఎగ్రిగేటర్ వెనుకా ఒక వర్గం తయారైంది. ఆ గాంగ్ ఏ చెత్త రాసినా చెల్లుబాటు అవుతుంది. దానికి మళ్ళీ భజన బృందం తయారుగా ఉంటుంది. ఆ వర్గాన్ని ఎవరైనా విమర్శిస్తే వాళ్ళని కెలుకుడు బ్లాగర్లు అని ముద్ర వేసి వెలి వేస్తారు. ఇదీ బ్లాగులోక బూర్జువాల వరస.
అసలు ఇంకొక అగ్రిగేటర్ని కాగడానే ప్రొమోట్ చెస్తే ఎలా ఉంటుంది. అన్న అయిడియాని నాకు కలిగించిన కూడలి హారం బూర్జువాలకు నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆ అగ్రిగేటర్ లో అందరికీ సమాన భావ వ్యక్తీకరణ స్వేచ్చ ఉండాలి. తీవ్ర విమర్శలని కూడా నవ్వుతూ స్వీకరించె స్థాయి ఉండాలి. ఎవరైనా మనమీద పేరడీ రాస్తే దాని గౌరవంగా భావించి ఆ బ్లాగర్ కు కృతజ్ఞతలు చెప్పగలిగే, హాయిగా నవ్వుకోగలిగే హృదయ వైశాల్యం ఉండాలి.
ఈ సందర్భంగా కాగడా త్వరలో ప్రారంబించ బోయే ఎగ్రిగేటర్ కోసం ఎదురు చూస్తుండండి.భావ వ్యక్తీకరణ స్వేచ్చ వర్ధిల్లాలి. బ్లాగు కుట్రలు దౌర్జన్యాలు అంతం కావాలి. బ్లాగు బూర్జువాలు నశించాలి. విప్లవం జిందాబాద్...