23, నవంబర్ 2009, సోమవారం

కామెంట్ల లోని మర్మం

గురు గారు నాదో డౌటు... అడిగింది రమణి



చెప్పు అన్నాడు కాగడా విలాసంగా ఉయ్యాల బల్లలో ఊగుతూ



మన మదన్ బ్లాగు మొదలు పెట్టి రెండేళ్ళయింది. ఇప్పటికి ఓ యాభై పోస్టులు రాసుంటాడు. పట్టుమని రెండు కామెంట్లు కూడా లేవు. అదే నా బ్లాగులో అయితే నేనెంత చెత్త రాసినా రోజుకి మినిమం ఇరవై కామెంట్లున్తాయ్. దీని భావమేమి గురూజీ?



హ హ హ గట్టిగా నవ్వాడు కాగడా.



నీ పేరేంటి?

రమణి.

ఆడి పేరేంటి?

మదన్



అదే తేడా. చెప్పాడు కాగడా. ఆడదైతే చాలు వెంటపడే కామెంట్ల కామరాజులు బోల్డుమంది ఈ బ్లాగ్లోకంలో ఉన్నారమ్మ .



చ... కాదులే గురూజీ నువ్వు ప్రతిదాన్నీ అదే చూపుతో సూత్తావ్.



అవునా. ఒకే అయితే ఒక పందెం. మన మదన్ని ఆడ పేరుతొ బ్లాగోపెన్ జేసి ఏదో చెత్త రాయమను. ఏ కామేన్ట్లోస్తయ్యో నాకు జెప్పండి. అంటూ ఎం రాయాలో కూడా రమణి చెవులో చెప్పాడు.

--------------------------------------------------------------------



మర్నాడు రమణీ మదన్ పరిగెత్తుకుంటూ వచ్చారు.

గురూ గురూ నువ్వు సూపర్ గురూ

ఏమైంది ? అడిగాడు కాగడా

ఏముంది నువ్వు చెప్పినట్టే " మల్లెలు-విరజాజులు" అని ఒక బ్లాగోపెన్ జేసా. చెప్పాడు మదన్.

బ్లాగిణి పేరు? అడిగాడు కాగడా.

అదే. స్వప్న సుందరి అని పెట్టుకున్నాలే. చెప్పాడు మదన్.

ఎం రాసావో ఏమైందో చెప్పు అడిగాడు కాగడా.

వినండి మరి చదివాడు మదన్.



నా వయసు 22. పుట్టింది గుడివాడలో పెరిగింది పెద్దాపురంలో. హైదరాబాద్ లో ఒక కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా జేస్తున్నా. ఇదే నా మొదటి "పైకూ" కవిత. బ్లాగులోకంలో నేను కొత్త. భయం గా ఉంది. అయినా రాస్తున్నా. ఆదరిస్తారు కదూ.



పై కూ కవిత

------------

వచ్చాడు

వేశాడు

వచ్చింది

డాక్టర్ని కలిశాను

తిట్టింది

తీయించుకున్నాను

ఇంకో డోచ్చాడు

కట్టాడు

కాపురం చేస్తున్నాను

పిచ్చి వెధవ ...........:)

---------------------



విరగ బడి నవ్వారందరూ

ఎగబడి కామెంటారా? అడిగాడు కాగడా

అదీ అయ్యింది. గంటలో 100 కామెంట్లోచ్చాయ్. మురిసిపోతూ చెప్పింది రమణి.



ఎవరెవరు ఏమేం రాసారో చెప్పు ఆడిగాడు కాగడ

వినండి అంటూ చదవ సాగింది రమణి



మోతి ఇలా కామేన్టింది

నువ్వు ఆడ దానివేనా? ఆడ పుటక పుట్టి ఇలా బరి తెగిస్తావా? చేస్తే చేసావ్. అన్నీ రాసేయడ మేనా? ఏం మేం చెయ్యలేదా. అంత మాత్రాన మా బ్లాగుల్లో రాస్తున్నామా? మాంసం తింటున్నామని బోమికెలు మెళ్ళో వేసుకోవాలా? ఛీ? ముందు మా ప్రమాద వనం లో చేరి పర్మిషన్ తీసుకుని తర్వాత రాయాలని తెలీదా? ఈ రోజునించి ఏ ఆడదీ నీ బ్లాగులో కామెంటు రాయకుండా నే చూస్తా? ఖబాద్ దార్



కుచాత ఇలా కామేన్టింది

ష్ .. చిన్నగా. నాకు నీ పోస్ట్ బాగా నచ్చింది. వాస్తవాలు రాశావ్. కానీ నేను ఓపెన్ గా కామెంట్ రాయలేను. అలా చేస్తే మా వనం లోంచి నన్ను వేలేస్తారు. మోతీ వోప్పుకోదు. ఎం చేస్తాను? వీళ్ళకి భయపడి కామెంటు రాయలేని స్తితిలో ఉన్నా. ఛీ వెధవ బతుకు. . నీ బ్లాగు చదివేవాళ్ళలో నేనే ఫస్టు. ఒకే బై...

చున్నీ....... మీ హైకులు చదివాక నా గుండె ఝల్లు మంది .నా అంతరాత్మే ఆ కవిత మీ చేత రాయిన్చిందేమో అని పించింది .ఆఫీసు లో విసిటర్స్ ని ఎవర్ని కలవను అని చెప్పేసి బ్లాగ్ ముందుకూర్చున్నా గత స్మృతుల్ని నెమరు వేసుకుంటూ .

మురుగేశ్వర ..... అమ్మా అమ్మాయివి. పెళ్లికాకుండానే అమ్మవు అవకుండా జాగర్త పడినందుకు అభినందిస్తున్నా,ఇప్పుడు పెళ్లి అయిపోఇంది కాబట్టి నీకు వచ్చిన నష్టం ఏమి లేదు ఏదన్నా వుంటే మీ ఆయనకి తప్ప .

ముందు తప్పులు జరగ కుండా కావాలంటే తాయెత్తు కడతా అది కుడా మీ వారికీ తెలీకుండా ఎప్పుడు కలవమంటావో మెయిల్ చెయ్యి.

అడ్డ గాడిద ...... అడ్డమైన వెధవల తో తిరిగి అడ్డ దార్లు తొక్కితే కక్కులు ఆ పైన ఇలాంటి హైకులు , అయినా మీ దైర్యానికి నా జోహార్లు...

భ రా రే ,,,,,,,, స్వప్నగారు నేను అందరి బ్లాగుల లోకి వెళ్లి వాళ్ళలో నిద్ర పోతున్న శక్తుల్ని లేపి ప్రోత్సహించడం అలవాటు .అదేంటో మీ మొదటి హైకుల తో నా లో నిద్ర పోతున్న కొన్ని శక్తుల్ని మీరే లేపారు .రేపు ఏం జరిగినా మీరే బాద్యత వహించాలి .

కవిగారు ....... ఇంతకీ'' అతనెవరు?''వచ్చాడు ,వచ్చాడు అనడమే గాని ఆ సచ్చినాడి పేరు రాయక పోవడం విచార కరం.

మలక్పేట జాడి.........జీవితం లో విపరీతమైన కేలుకుడుకి తట్టుకుని రాటు దేలిన వారె బ్లాగ్ లోకం లోకి అడుగు పెడతారని నిరూపించారు స్వప్నగారు.

ప్రవీణ్ ఖర్మ .... స్వప్నా. మొగుడు చచ్చిన నడి వయసు విధవరాలినో , మొగున్నోదిలేసిన ముసిల్దాన్నో పెళ్లి చేసుకోటమే నా జీవితాశయం. అసలు కమ్యూనిజం రష్యాలో పుట్టి ఇండియాలో ఎందుకు చచ్చిందో నీకు తెలుసా? ఎలా తెలుస్తుందిలే. నీ పేరెంట్స్ బాంక్ ఆఫీసర్స్ కారుగా. నువ్వు పెద్దాపురం కేసువా? అయితే వేల్పూర్ రోడ్డులో మలక్ నీకు తగిలున్డాలే? లెనినిస్టు భావజాలం వర్ధిల్లాలి. అగ్రవర్ణాలు నశించాలి. దీనిమీద నేనో కంప్యుటర్ ప్రోగ్రాం రాయాలి. వస్తా.

శరత్ ......స్వప్న గారు ఇలా తీయించుకునే బాధ లేకుండా నేను సాటి వారి తోనే సాన్ని హిత్యాన్ని కోరుకుంటాను . ఆ వచ్చిన వాడి సెల్ నెంబర్ వుంటే ఇస్తారా కొంచెం?

నెమలిపన్ను........మీరు ఇలాంటి కవితలు ఇంకో నాలుగు రాయండి చాలు,మీ బ్లాగ్ బ్రహ్మాండం అని నేనో రివ్యూ రాస్తా దాని మీద, ఇంక చూస్కోండి హిట్స్ హిట్స్ .

సుత్తి మహేష్ .......ఇంతకీ మీకు చేసిన వాడి కులం కనుక్కునారా?ఇదేదో అగ్రవర్ణాల కుట్రేమో?

బ్రాహ్మినికల్ ఆలోచనలతో మొదలెడితే ఇలా అర్దంతరం గా ముగియ వలసినదే . కాని వాడు డబ్బులిచ్చాడో లేదో ముందు పర్సు చూసుకోండి. ఇస్తే వాడు అగ్రవర్ణపు వాడే. వాళ్ళలో ఇంకా కొంత నిజాయితీ మిగిలి ఉంది. ఒప్పుకోవాలి తప్పదు.

జిలేబి .......వస్తే వచ్చాడు ,చేస్తే చేసాడు , వస్తే వచ్చింది , పొతే పోయింది చీర్స్.

ఆలోచనా తరంగాలు ............ భగ యోగం పట్టినప్పుడు జాతకుడు ఏమి చెయ్యలేడు, పోయి తన పని తానూ చేసేయ్యడమే తప్ప . నన్ను ముందు గా కలిసి వుంటే వాడికి ఆ యోగం తో పాటు రోగం కూడా రాకుండా తంత్ర విద్య నేర్పే వాణ్ణి కదా?

కవితార్పిత ........ అందుకే నేను ప్రేమ , దోమ తోనే ఆగి పోయా అంతకంటే ముందుకు పోయి వుంటే నేను మీలాగే కవితలు రాసుకోవలసి వచ్చేదేమో.

అమ్మవోడి ..........నువ్వు తప్పు చెయ్యడం వెనక నకిలీ కనికుడి వ్యవస్థ కారణం . అసలు ప్రపంచం లో ఎవరికి గర్భం వొచ్చినా , గర్భ విచ్చితి జరిగినా ఈనాడు రామోజీ రావే కారణం . మిగత విషయాలు తర్వాత టపా లో వివరిస్తా

అంతవరకూ అమ్మ కడుపు చల్లగా ఇంక ఏ తప్పులు చెయ్యకుండా కూర్చో .

మరువం ........... ఆడ , మగా ఆకర్షణ ప్రకృతి సిద్దమైన్డి .అది సంయోగం కావచ్చు , సంబోగం కావచ్చు .

విశ్వామిత్ర సృష్టి కి ప్రతి సృష్టి చెయ్యలేదా?సో డోంట్ ఎవర్ రిపీట్ ది సెం మిస్టేక్. నా కంతే కోపం వచ్చినప్పుడు ఆంగ్లమే అంగా లన్నిటి లో పలుకు తుంది .

నేస్తం .... మొన్న మా చెల్లి కి ఫోన్ చేసినప్పుడు ఇదే చెప్పా , మా దగ్గర వొక బ్లాగర్ పెళ్ళికి ముందే కాలు జారి మళ్లి ఏమి ఎరగని దానిలా మొదటి రాత్రి కెవ్వున కేకలు ట ,యెంత ధైర్యం గా రాసిన్దనుకున్నావ్ అని . దానికి మా చెల్లి,, వుర్కోవే మీ మరిది అసలే అనుమానపు పిశాచి , నేనూ అరిచాను గా నన్ను కుడా అలాగే అనుకుంటాడు అంటు ఫోన్ పెట్టేసింది

నేను-టచ్ మీ ...... ఏవిటి యి జీవితం పిండం గా చస్తే ఏంటి ?పండు ముసలి లా చస్తే ఏంటి?ఎప్పుడన్నా చావా వలసిందే

బస్సు ఎక్కితే వేస్తారు ,గుడి రష్ లో వేస్తారు ,ఆఫీసు లో వేస్తారు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ వేస్తారు . యి కట్టే కాలే లోపు ఎన్నో సార్లు ఎంతో మంది వేస్తారు .దీనికి బాధ పడుతూ కవితలు రాయాలా?బ్లాగు మూసుకుని కూర్చుంటే పోలా?

వేణు నీకాంత్ .....ఎవరో వచ్చారని , ఏదో చేసారని

దిగులు పడుతూ కుర్చోకుమా

డబ్బులిచ్చాడో , దొబ్బెసాడో

పర్సు లోన చెయ్యి పెట్టి వెతుక్కో మ్మా

పరిమళం .....స్వప్న నువ్వు తప్పు చేసావ్ నేను తెలుగు మాత్రమె తెలిసిన ఆడపిల్లను అని మొదట్లోనే చెప్పేసి వుంటే ఆ తెగులు పని జరిగేది కాదేమో?కోన సీమ లో కొన్నాళ్ళు రెస్ట్ తీసుకో మా సోమయ్య నిన్ను అయ్య లా చూసుకుంటాడు . కాని కోనసీమ కోడె గాళ్ళతో కుసింత జాగర్త.

నిషిగంధ ..........మొగ్గను రాల్చే హక్కు నికేక్కడిది?

తొందర పడి వొక కోయిల ముందే కూయనెలా ?

తుమ్మెద పారిపోతే పువ్వెందుకు వాడి పోవాలి?

అమ్మాయి అమ్మ కాకుండా ఎందుకు ఓడి పోవాలి?

తోటరాముడు.....స్వప్న గారు అసలు కడుపు వచ్చింది ఆ లేడీ డాక్టర్ కి ట మా దినకర్ చెప్పాడు , ఆ పిండాన్ని

చూపించి మీ దగ్గర డబ్బు గుంజరన్న మాట .మీరు గంగ అంత పవిత్రులు అయితే మా దినకర్ ట్యాంక్ బండ్ అంత అపవిత్రుడు , ఆ పిండానికి గండం రావడానికి మా వాడి ఆవేశం కారణం అని నా నమ్మకం .

తాడేపల్లి ......ఇది పురాతన కాలం లోంచి జరుగుతున్నదే .శకుంతల కుడా అలాగే మోస పోయింది .ఆ తర్వాతే దేవాలయాల్లో బూతు బొమ్మలు చెక్కి సెక్స్ విజ్ఞానాన్ని పెంచారు .చూస్తే మీరు నాస్తికుల్లా వున్నారు అందుకే మీకు తగిన శాస్తే జరిగింది . ఇకనుంచైనా దేవాలయాలకేల్లి నపుడు అక్కడి బూతుబోమ్మలు దీక్షగా చూడ కండి .

బావ దీయుడు ....అక్కయ్య గారు వొక వేళ బావగారికి అనుమానం వచ్చి యి బిడ్డ కి తండ్రెవరే అని నిల దీస్తే మీరు వెంటనే కృష్ణ కాంత్ పార్క్ లో జరిగే మా మీటింగ్ కి వచ్చెయ్యండి .ఎవరో వొక బకరాని అప్ప చెపుతా మీకు. వీడే అని చూపిద్దురు గాని .

బి .సి . రావు .... మీ కవిత చదివాక నా మనసు వశం తప్పింది .మరిన్ని వినాలని ఆరాట పడుతోంది . మీరు వెంటనే మీ సెల్ నెంబర్ నాకు మెయిల్ చేస్తేమీ వారు లేనప్పుడు మనం సంపర్కించు కోవచ్చు .



సెభాష్ శిష్యులారా. ఇప్పటికైనా నా థియరీ కరెక్టు అని ఒప్పుకుంటారా? అన్నాడు కాగడా.



ఓ ఒప్పుకుంటాం ఒప్పుకుంటాం అంటూ అరిచారు శిష్యులు.



సరే గాని పైకూ కవిత అంటే ఏమిటి? అడిగాడు మదన్.



పైత్ర్యపు కూతలు కి సంక్షిప్త రూపం అన్నమాట.. చెప్పాడు కాగడా. ఒకే , కాని ఇవన్ని చదివాక నాకు బురద లో కప్పల తో పాటు కలువ పువ్వులు కుడా ఉంటాయని అర్ధం అయ్యింది . అయితే ఎక్కువ మంది కామెంట్స్ ఆడవాళ్ళని పొగిడేసి వాళ్ల మెయిల్ id నో , సెల్ నంబరో పట్టేసి పెట్టీద్దామని చూసేవారే (కొంపలో చిచ్చు) అంటు చిద్విలాసం గా నవ్వాడు కాగడా .



అప్పుడే రమణి సెల్ మోగడం తో హడావిడి గా అక్కడ నుంచి పరిగెత్తింది .

3, నవంబర్ 2009, మంగళవారం

పిడత కింద పప్పు

మొన్ననే మా చుట్టాల శోభనానికి కాకినాడ వెళ్ళవలసి వచ్చింది .అదేంటో నేను శోభనానికి ముందు పిడత పగల గొట్టి దిష్టి తీస్తే గాని శోభనం చేసుకోరు .



రాజమండ్రి లో ట్రైన్ దిగి కారు లో కాకినాడ వెళ్తున్నా . పెద్దాపురం రాగానే కారు ఆపించి మెరక వీది లో ఆ మొదటి ఇంటికేసి నడిచాను . ఆ ఇంటి తో నా చిలిపి జ్ఞాపకాలూ చాలానే వున్నాయి .ఆ ఇంట్లోనే పంకజం నాకు మొదటి సారి పిడత కింద పప్పు రుచి చూపించింది .



మొదటి సారి వూరికే చూపించినా , ఆ తర్వాత ఆ రుచి కి నేను బానిస అయిపోవడం తో డబ్బు చేతిలో పెడితేనే పిడత ఇచ్చేది .వోకోసారి డబ్బులు తక్కువగా వునప్పుడు వాళ్ళ చిన్న చెల్లెలి చిన్న పిడత ఇచ్చేది .అలా ఆ ఇంట్లోనే ఎన్నో పిడతలతో ఆడుకున్నా .పిడతలు చిన్న వైనా , పెద్ద వైనా పప్పు మాత్రం నా దగ్గర పచ్చడి అయిపోవల్సిందే .



ఆ యింట్లో ఎప్పుడు గానా బజనాలు అవుతూ వుండేవి .వొక సారి నేను మందు ఎక్కువై'' హమ్ తుం ఏక్ టాయిలెట్ మే బంద్ హో , ఔర్ పానీ రుక్ జాయి'' అని పడితే పంకజం నన్ను పక్కకి తీసుకెళ్ళి అక్కడ కేవలం తెలుగు పాటలే పాడాలని చెప్పింది .



వాళ్ళింట్లో ఎప్పుడు పడక గది తలుపులు వేసుకుంటూ నో ,మూసుకుంటూ వుండడమే గాని బార్ల తెరిచి వుండగా ఎప్పుడు చూడలేదు .పంకజం అప్పుడప్పుడు దగ్గినా ఎప్పుడు నవ్వుతు వుండేది . నేను మళ్ళి మా వూరు వెళ్ళినప్పుడల్లా మా వీధి డాక్టర్ మాత్రం వారం లో వొక స్కూటర్ నేనిచ్చిన డబ్బులతో కొనుక్కునే వాడు అదేంటో . అది దగ్గితే నేను ట్రీట్మెంట్ చేయించు కోవలసి వచ్చేది .



ఆ రోజుల్లో ఆ ఇంట్లోనే పందిరి మంచం వుండేది దాని గొప్ప తనం ఏంటంటే యెంత మంది ఎక్కినా ఇంకా వోకళ్ళకి అవకాశం ఇచ్చేది .అంతే కాకుండా కింద కూడా ఎవరికి కనబడకుండా దాక్కునే అరల సదు పాయం కుడా వుండేది .

సాయంత్రం ఆరు దాట గానే ఆ ఇంటి ముందు రిక్షా లలో బిల బిల మంటూ పంచెలు ఎగేసుకుని కస్టమర్స్ పంకజం అమ్మే పిడత కింద పప్పు కోసం ఎగ బడే వారు .



చినప్పుడు చిన్న పిడతలతో సరి పెట్టుకున్న నేను , వయసు పెరుగు టున్న కొద్ది పిడతల సైజు కుడా పెంచుకుంటూ వచ్చా .పంకజం కింద పిడత కింద పప్పు అమ్మితే , పైన మామిడి పళ్ళు కూడా అమ్మేది .ఆమె మామిడి పళ్ళు రుచి చూసిన వాళ్ళెవరైనా మళ్ళి కిందకి వచ్చి పిడత కింద పప్పు తినాల్సిందే .వొక సారి నా దగ్గర మామిడి పళ్ళ కే డబ్బులు వున్నాయని అవే కొనుక్కుని జుర్రు కుంటుంటే తనే తట్టుకోలేక పిడత వూరికే ఇచ్చేసింది .లోపలనుంచి వాళ్ళ అమ్మ ఇదిగో అమ్మాయి ఇలా పళ్ళు పిసికిన వాళ్ళందరికీ పిడత వూరికే ఇచ్చేస్తే గుడిమెట్ల మీద అడుక్కుంటూ బతకాలి అని అరిచేది .



ఇప్పుడు పూర్తీ గా మొండి గోడలు మాత్రమె వున్న ఆ ఇంట్లో నుంచి వొకప్పుడు గుడిలోన నా స్వామి కొలువై వున్నాడు అంటు పాటలు వినిపించేవి .కళ్ళ ముందు పంకజం వాళ్ళ చెల్లెళ్ళు మెదిలారు , యెంత ఆప్యాయం గా పిడత కింద పప్పు అమ్మే వారు .అప్పు రేపు అని ఆ రోజుల్లో రాసుకున్న వాక్యం ఆ మొండి గోడల మీద అలాగే వుంది .



పక్క ఇంట్లో గేటు దగ్గరే నిలబడి కాకినాడ కాజాని నోట్లో పెట్టుకుని ముందుకి వెనక్కి తోసుకుంటూ నా కేసు చూస్తున్న అమ్మాయిని దగ్గరగా వెళ్లి ఇక్కడ పంకజం అని పిడత అనే లోపు . ఇంకెక్కడి పంకజం అండీ దాని పిడత కింద పప్పు ఘాటుకే గుటుక్కుమన్న వాడెవడి నుంచో సంక్రమించిన ఏదో మాయదారి రోగం తో అది గుటుక్కు మంది అంది .



నాకు ఇంకేమి వినిపించటం లేదు అంటే గత పదిహేను రోజులు గా బరువు తగ్గి పోవడానికి కారణం ఆ పప్పు ఘటా?ఇంతలొ సెల్ మోగింది ''ఏంటి బావ నువేప్పుడు ఇక్కడొచ్చి ముంత పగల గోడతావు ?అసలే ఆయనకీ నరాల బలహీనత అట . తొందర గా కానిచ్చేయ్యాలి అంటున్నారు ''



నా కెందుకో యి సారి ముంత పగల గొట్టి ఇంకో జీవితం నాశనం చెయ్యాలని లేదు , సంపూర్ణ మైన ఆరోగ్య వంతుడే ముంత పగల గొట్ట డానికి , దిష్టి తియ్య డానికి అర్హుడు . డ్రైవర్ తో చెప్పా కారు రాజముండ్రి వైపు పోనిమ్మని . సెల్ మోగుతూనే వుంది . సైలెంట్ మోడ్ లో .పంకజం ఆత్మ శాంతి కోసం కళ్లు మూసుకున్నా .