2, ఏప్రిల్ 2010, శుక్రవారం

నేను మారనా?


నేను మారాననే అనుకున్నా

నువ్వు నా తలుపు తట్టనంత వరకు

వొంటరి గా వున్నా మందే కొడుతున్నా

అంతవరకే అనుకున్నా నువ్వు వచ్చేంత వరకు

వర్షానికి తడిసి ముద్దై పోయి , గుమ్మం ముందు నువ్వు నిలబడే వరకూ

నేను మారాననే అనుకున్నా లోపలకి నిన్ను రమ్మన్న వరకూ

భీత హరి నేక్షిని లా నా ముందు నువ్వు కూర్చున్నావు

నీ వంపు సొంపుల అందాలని ఆస్వాదిస్తూ కూడా నే మారాననే అనుకున్నా

కరెంటు పోయే అంత వరకూ వొక ఉరుము ఇద్దర్ని దగ్గర చేసేంత వరకూ

నే మారాననే అనుకున్నా ఆ చీకటిలో జరిగి పోతున్దనుకున్న ఆ తప్పు

జరిగిందో లేదో తెలియనంత వరకూ నే మారాననే అనుకున్నా

కరెంటు వచ్చింది వాన వెలిసింది నువ్వు మాత్రం కాన రాలేదు

నా పర్సు గొలుసు తో సహా మాయం అయి పోయావు

పెద్దాపురం హోం డెలివరీ అని సరి పెట్టుకున్నాను

అక్కడ మంట మొదలయ్యే అంత వరకూ

డాక్టర్ సమరం నిజం చెప్పేంత వరకూ

పోగొట్టు కున్నది ధనమే కాదు జీవితం కూడా అని

తెలిసే అంతవరకూ నే మారాననే అనుకున్నా