10, మార్చి 2010, బుధవారం

అడవి మనిషి

నా అరణ్యంలో ఇంకేం మిగిలింది?


ఎన్నోఈటెల పోట్లు,

ఇంకెన్నోబరిశెలు,

డబ్బులివ్వకుండా పరారైపోయిన

మనుషులు



ఆలోచనకి పట్టిన గ్రహణాలు,

రోజుకి పదిసార్లు స్నానాలు,



ఆగడాలు ముదిరిన వ్యసనాలు,

కాగడాకి కప్పిన శాలువాలు,

జారి పోయిన పరువాలు

అయినా యువతుల లాగే బింకాలు



అసమర్థులు అంటించిన రోగాలు,

ఆ పైన కనుమరుగైన భోగాలు

విశ్రాంతి కూడా ఇవ్వని మైలలు,

అయిన డ్యూటీ సర్దుకోని తోటి మహిళలు



మాటతెలిసిన మృగాలు,

నోట్లు రాల్చని జేబులు

తాట వలుస్తున్న విటులు,

కౌంటర్ లో కూర్చుని పాట పాడుతున్న

జ్యోతులు



గాండ్రించు జింకలు,

గర్జించే నెమలిపిట్టలు,

కూస్తున్న తీతువుపిట్టలు

వెరసి నాకు మెంటలు...



ఆయాసం నాకెందుకుంటుంది?

నా అడవి చాలా మంచిది,

నా కందరూ నేస్తాలే,

పచ్చికలు ముచ్చికలు,

పూలసరాలు నిత్య సరసాలు,

లేతరెమ్మలు, పాతదిమ్మలు,

గాలిస్వరాలు

పెద్దపెద్ద వేణువులు,

ఎగిసిపడే సర్పాలు,

కదిలే మంచం చప్పుళ్ళు

వారు వచ్చేలోపే కానిచ్చే కార్యక్రమాలు



వారు తలుపుకొట్టగానే

నవ్వుతూ ఫ్రెష్ గా

తలుపుతీసే మామూలు మనిషిని.......