9, మార్చి 2010, మంగళవారం

మహిళా దినోత్సవం


ప్లాన్ ప్రకారం లంకిణులందరూ, సారీ... బ్లాగిణులందరూ ప్రమోదవనం హెడ్ క్వార్టర్సులో సమావేశమయ్యారు. మోతీ మైకు చేతిలోకి తీస్కుని నిలబడింది.



ప్రియమైన బ్లాగిణులారా. నేడు మహిళా దినోత్సవం. దాన్ని ఘనంగా మనం జరుపుకోవాలని ముందుగానే మీకు మెయిల్ పెట్టాను. ఈ లోపు ఎవరో గూడచారి ఈ విషయాన్ని ఆ కాగడా గాడికి చేరవేసింది. వాడేమో జాకెట్ల పండగ అంటూ పేరడీ రాసేసి మనపని కామెడీ కింద మార్చేసాడు. అయినా సరే పట్టు వదలని విక్రమూర్ఖుల లాగా మనం ఇక్కడ సమావేశమయ్యాం. ఇప్పుడు మీకందరికీ ఒక టాపిక ఇస్తాను. దానిమీద మీ మీ అభిప్రాయాలు చెప్పాలి. తరువాత అందరం కలిసి ఇదే విషయం మీద మన మన బ్లాగుల్లో నానా చెత్తా రాసేసి మొగ బ్లాగర్లకు బుద్ధి చెప్పాలి.



అలాగే అలాగే..ఆ టాపిక్కేంటో తొరగా చెప్పు. అంటూ అందరూ పొలోమని అరిచారు.



"మరో జన్మంటూ ఉంటే"... అనే టాపిక్ మీద మనందరూ ఇప్పుడు చర్చించుకుంటామన్నమాట. గొప్ప సత్యాన్ని కనిపెట్టిన మేధావిలా చెప్పింది మోతి.



ఈ జన్మ ఇలా తగలడింది. ఇక ఒచ్చే జన్మ గురించా ఇప్పుడు చర్చ..ఉష్ అబ్బా.. దీనికోసం ఇంత బిల్డప్పా..అంటూ నిట్టూర్చారు చాలామంది.



అయినా సరే మోతీ ఒప్పుకోలేదు. తాను పట్టిన కుందేలుకి అసలు కాళ్ళే లేవన్న వాదం ఆమెకి చాలా ఇష్టం.



మొదటగా నా అభిప్రాయం చెప్తాను. అంటూ మొదలెట్టింది మోతి.



అందరూ చెవుల పిల్లుల్లా చెవులు రిక్కించారు.



వచ్చె జన్మంటూ ఉంటే కాగడానై పుట్టాలని నా కోరిక. అని చల్లగా చెప్పింది మోతి.



వా..వా..వా..అంటూ గిన్నెలు, ప్లేట్లు మోగించారు అందరూ.



మరి నీ "మనసులో మాట" కూడా చెప్పుమరి. అంటూ ఒక మహిళకు మైకు అందించింది మోతి.



నాకైతే ఈ జన్మలోనే కాగడా ని పరిచయం చెస్కోవాలనుంది. ఒక వ్యక్తి మీద నాకనుమానంగా ఉంది. నువ్వేనా కాగడా అని అతన్ని అడిగాను కూడా, కాని తను కాదన్నాడు. అమెరికాలో ఉండే తనకు అలా పేరడీలు రాసే టైమ్ ఉండదని చెప్పాడు. నిరాశగా చెప్పింది ఆ మహిళ.



భోరుమని ఎక్కిళ్ళూ పెట్టి ఏడ్చారందరూ.



మరి నువ్వేమంటావ్ పిన్నీ. అడిగింది మోతీ



ఆ కాగడా గాడు గానీ నాగ్గానీ కనిపిచ్చాలీ. నా చేతుల్లో చచ్చాడే వాడు. కోపంగా రొప్పుతూ అరిచింది పిన్ని.



ఏం ఎందుకంత కోపం నీకు... అడిగింది మోతీ.



ఇంతకుముందు నీ మీద పేరడీలు రాసేవాడు. కొన్నాళ్ళూ నా వేంట పడ్డాడు. ఇప్పుడు పరువానికి రాస్తున్నాడు. వాడికి సాహిత్య విలువలు ఏమాత్రం ఉన్నా ఒకళ్ళ మీదే పెరడీలు రాయాలి. ఇలా రోజుకొకరి మీద రాస్తే నెనొప్పుకోను. అరిచింది పిన్ని.



ఓ అదా నీ బాద. అడిగింది మోతి.



అదే కాదు. ఇంకా ఉంది. ఇంతకు ముందు నా బుర్రలోకి ఏ అలోచనొఃచ్చినా వెంటనే బ్లాగులో రాసెసెదాన్ని.ఇప్పుడేమో ఈ కాగడా గాడు ఏ పేరడీ రాస్తాడో అని ఒకటికి వంద సార్లు ఆలోచించి రాయాల్సిన గతి పట్టింది. అంది పిన్ని.



నిజమె నిజమె అందరూ అరిచారు.



నువ్వేమంటావ్ "కిషి కింధ" అడిగింది మోతీ.



ఏమంటాను.అజ్ఞాతగా నాకు అరవైనాలుగు కామెంట్లు రాసింది కాగడానే. ఆ మాత్రం కనిపెట్టలేనా. అయినా సరే కేవలం మీకందరికీ బయపడి, నా లెటెస్ట్ పోస్ట్ లొ కాగడాకి నా థాంక్స్ చెపలేని దురదృష్టవంతురాల్ని మోతీ,,హు,,హు,,హు. వచ్చె జన్మలో కాగడా కూడా నాతో పాటు అమెరికాలో పుట్టాలని నా కోరిక,, అంటూ పాతకాలం సినిమాలో హీరోయిన్ లా కుమిలిపోయింది కిషి కింధ.



అందరూ ముక్కులు చీది సంఘీభావం ప్రకటించారు.



నీ భావాలు కూడా మాతో పంచుకోండి అని దూరంగా కూచున్న ఒక పెద్దావిడను అడిగింది మోతి.



కాగడా ఎవరో కాదు. రామోజీరావే కాగడా పేరుతో బ్లాగులో రాస్తున్నాడు. ఈ సంగతి నాకు బాగా తెలుసు. నమ్మకంగా చెప్పింది ఆవిడ.



ఎలా చెప్పగలవ్,, అడిగారందరూ.



అందికే మిమ్మల్ని రోజూ ఈనాడు పేపర్ చదవమని నా సలహా. నేనైతే ఇంట్లో పని మొత్తం మావారి చెత చెయిస్తూ సాయంత్రం దాకా ఈనాడు క్షుణ్ణంగా చదూతాను. రాత్రికి నా అనుమానాలు బ్లాగులో రాస్తాను. మావారు వంట చేసి భొజనానికి అంతా సిద్దం అని చెప్తే అప్పుడు కంప్యూటర్ ముందు నుంచి లేస్తాను. అంది ఆవిడ



ఇంతకీ అసలు సంగతి చెప్పేడువ్ ..అరిచారు సభ్యులు.



ఆ పాయింట్ కే వస్తున్నా. ఈరొజు పొద్దున్నె చూసాను. ఈనాడు పేపర్ ఫస్ట్ పేజీలో చూసారా." కాగడా మార్కు బీడీలనే ఎల్లప్పుడూ వాడండి" అని యాడ్ ఉంది. ఇది నాకు రామోజీరావుకు మాత్రమే తెలిసిన కోడ్. ఈనాడు పేపర్ ద్వారా మా కుటుంబాన్ని వేధిస్తున్నాడు. కాగడా పెరుతో మిమ్మల్ని వేధిస్తున్నాడు. వాడె వీడు. అంది ఆవిడ,.



హుర్రె,,,హుర్రె అని అరిచారు అందరూ.



కొందరేమో, ఆడాళ్ళకీ బీడీలకీ హేవిటో సంబంధం? అని ఎర్రిమొకాలేసుకో్ని చూస్తున్నారు.



పరువం వచ్చే జన్మలో నువ్వెం అవుతావో చెప్పు.అడిగింది మోతి.



కాగడాలో తైలంగా మారుతా

ఆగడాలు బాగా చెసెస్తా

కాగడాలో మండే జ్వాలనౌతా

పావడాల పని పట్టేస్తా



అయినా నాకెందుకు. పరారే కి తెలిసిందంటే ఊరుకోడు.నా చిన్నప్పుడు మా ఇంట్లో లక్ష్మి అని గేదె ఒకటుండేది. దాని పేడ వాసన ఇప్పటికి నాకు గుర్తుంది. మా అమ్మ చిన్నప్పుడే పిచ్చిముండా అని ముద్దుగా నన్ను తిట్టేది.వెన్నెల్లో మిరపకాయ బజ్జీలో ఆవకాయ నంచుకోని తినెదాన్ని. అయినా కాగడా అంటే నాకేం బయం లేదు. ఎర్రగడ్డకి రమ్మని చెప్పండి నా తడాఖా చూపిస్తా.. అంటూ తనకలవాటైన పిచ్చి ధొరణిలో తనకు పిచ్చి అన్న నిజాన్ని బయట పెట్టెసింది పరువం.



కాగడా ఎవరో తరువాత తేలుద్దాం.ముందు పరువం= ప్రవీణ్ శర్మ అని అనుమానం రావటంలే... అని గుసగుసలాడుకున్నారు కొందరు. ఇంకొందరైతే యాక్క్ ... యాక్క్... నీ కవితలు వింటే కవిత్వమంటేనె రోత పుడుతొంది అని డోక్కున్నారు.



చివరిగా మైక్ తీస్కుంది మోతీ.



ఆడ లేడీసుల్లారా. రెపట్నించీ మీకందరికీ ఒకటె ధ్యేయం, ఒకటే గమ్యం. అదేమిటో తెలుసా,కాగడా గాడు ఏ కలుగులో దాక్కున్నా మీ మీ చెత్త రాతలతో వాడికి జీవితం మీద విరక్తి పుట్టేలా చేసి, వాడంతట వాడే బయటపడి, మన కాళ్ళుపట్టుకునేలా చెయాలి. కాబట్టి కామ్రేడ్స్... రెచ్చిపోండి. మీ బుర్రల్లో ఉన్న పురుగులన్నీ బ్లాగుల్లో కుమ్మరించి వాడికి పిచ్చెక్కెలా చెయ్యండి. విప్లవం వర్థిల్లాలి. మొగాళ్ళూ,మొగుళ్ళూ నశించాలి. అని యమగోల లో ఎంటీఆర్ లా ఆవెశంతో ఊగిపోయి చెమటలు పట్టించెసుకుంది మోతీ.



సభ్యులందరూ అలాగే అలాగే అంటూ తొడలు చరిచి మీసాలు మెలెసి ఇంటి దారి పట్టారు.



ఒక సభ్యురాలు ఇంకో సభ్యురాలితో అంటోంది. అసలు కాగడా=జ్యోతి అని నా అనుమానం. కాగడా లెనిదే జ్యోతి వెలగలేదు. జ్యోతి లెని కాగడా కనిపించదు. ఇద్దరూ కూడబలుక్కుని కుమ్మక్కై బ్లాగర్లను మోసం చెస్తున్నారే..



ఇంతలో మోతీ ఫోన్ మోగుతోంది.....కాగడా కాలింగ్....కాగడా కాలింగ్....అంటూ...