18, మార్చి 2010, గురువారం

ఇదే నా ప్రతిజ్ఞా

వికట కవి శ్రీనివాస్ బ్లాగులో ఒక మహిళా ఎనానిమస్ గా రాస్తూ, " ఇవన్నీ అతన్ని ప్రశ్నించవచ్చు. కానీ నాకు చాలా భయం. మీరొకప్పుడు మీ బ్లాగులో వచ్చిన వ్రాతలకు భయపడినట్లే నేనూ భయపడుతున్నాను. అతను తిన్నగా సమాధానమివ్వకపోగా నా మీద కూడా అసభ్య వ్రాతలు వ్రాస్తాడు. అందుకే భయం." అని రాసింది.



అది చదివి కాగడాకి మా చెడ్డ బాదేసింది. హేవిటి నేను ఆడాళ్ళకి శత్రువునా అని ఆలోచించాడు. కాదంటే కాదని తేలింది. ఆడాల్లకోసం టైముని, డబ్బుని, ఆరోగ్యాన్ని చివరికి జీవితాన్నే పణం గా పెట్టి వారి ఆనందమే తన ధ్యేయం గా ప్రతిరాత్రీ శ్రమించే తనకు ఇటువంటి చెడ్డ పేరు వచ్చిందా అని బాధ పడ్డాడు. అందుకే ఒక భయంకర నిర్ణయం తీసుకున్నాడు. ఒక వారం వరకూ ఇక మీద మొగాళ్ళ మీదే పేరడీలు రాయాలి. అడాళ్ళను బాధ పెట్టకూడదు అని గాట్టిగా నిర్నయించేసుకున్నాడు. మనకెవ రైనా ఒకటేగా మరి :)





ఇప్పుడెవరికి పగులుద్దా అని డౌటా. సినిమా చూడ బోతూ కథ అడక్కూడదమ్మా అలాటి చచ్చు దౌట్ల తో "సుత్తికొట్టకు" వెయిట్ అండ్ సీ....