15, మార్చి 2010, సోమవారం

వొక్క మనసుని

పరుపు రాపిడికి పదును

పదును సాని కి పదము

పెదాలు అనిన సాయుధులకి ముదము

దానిని పేల్చడానికి వొక్కటి చాలు

కాని వోక్కడికి రాదు



తలుపు చాటుకు అదును

అదును చాటున పులుసు

మరిగి పోయిన మనసు

విరచడానికి వొక్కడు రాడు



పిలుపుకి అందని దూరం

దూర భారమేంచని పయనం

వెళ్ళినా పని అవ్వని వైనం

పని చెయ్యుటకు వొక్కడు రాడు



గెలుపును చూడని క్రీడా

మత్తేక్కించని బీడా

విత్తులు రాల్చని విలాసాలు

ఎందుకు పనికి రాని ఆ సరసాలు



మలుపు తిరిగే జీవితం

పక్కింటి ఆయనకే అంకితం

నా మనసుని తొలిచే కుమ్మరి పురుగు

ఎక్కువమంది లేరే యిరుగు పొరుగు