19, ఫిబ్రవరి 2010, శుక్రవారం
బలే బలే పేరడీలు సృష్టించావు
సుధా రమణీ వచ్చేసరికి కాగడా విచారంగా ఉన్నాడు.
ఎం గురూగారు. అట్టా ఉన్నారెంది
రాత్రి పీడకలోచ్చింది.
ఎట్టా. మీకు పీడకలా వచ్చిందా. చెప్పు గురూ.
ఓ కళ్ళజోడు బూతం కల్లో కొచ్చి నానా తిట్లూ తిట్టి పోసింది.
ఆ. కళ్ళ జోడు బూతమా.
అవును.
ఎం తిట్టింది గురూ.
నా నోటితో నేన్ చెప్పలేను రమణీ.
పర్లేదు చెప్పు గురూజే
ఆ బూతం ఎం తిట్టిందో తెలుసా. ఎందుకురా మా ఆడోల్ల మీద పడి ఏడుస్తావ్. నీకూ ప్రియురాళ్ళు లేరూ? రాయటాంకి టాపిక్స్ లేవురా ఎప్పుడూ ఆడోల్ల మిందే రాత్తావ్? నీ జిమ్మడ. నీకు దమ్ముంటే నీ మీదే ఒక పేరడీ రాయరా సూత్తాను. అంటూ ఆడ భూతులు అన్నీ తిట్టేసింది. అంటూ భోరుమనాడు కాగడా.
గొల్లున నవ్వారు ఇద్దరూ. అలా తిట్టిందా. ఆ తిట్లన్నీ గాలికి బోతైలే గాని అజ్జేప్పినట్టు కాగడా మింద ఒక మంచి పేరడీ చెప్పారాదే.
నవ్వాడు కాగడా. సరే రాసుకోండి.
రమణీ సుధా పెన్ను పేపరూ తీస్కున్నారు.
(భక్త తుక్కారాం సిన్మాలో బలే బలే అందాలు సృష్టించావు మోడల్లో)
బిళ్ళ హరి రాగం=దంపుడు తాళం
పల్లవి
బలే బలే పేరడీలు సృష్టించావు
ఇలా వేధించావు
ఇదేం ఆనందం
ఇదేం మాయరోగం
ఒరే కాగడాగా నీకు (బలే బలే పేరడీలు సృష్టించావూ)
చరణం
మాటలు రాని మృగాలు సైతం
నిన్నే చూచి పారిపోయెను
మాటలు నేర్చిన బ్లాగిణి జాతీ
మంచి బూతులతో నిను తిట్టేను
వయసే పెరిగీ బుద్దే తరిగీ
నిన్నే తిట్టారు బ్లాగినులు
నీవేల మారవు (బలే బలే పేరడీలు సృష్టించావూ )
చల్లగ తాగే మందుల లాగే
పైత్యం నీకు ఎక్కేయ్యాలి
గుంపుగా బతికే ప్రమదల వోలె
అందరు ఒక్కటై నిను తిట్టాలి
ప్రేమను చంపుకొని
కామం పెంచుకొని
బ్లాగుల బురదలో అందరూ
జంటలుగా మారాలి (బలే బలే పేరడీలు సృష్టించావు )
అది పత్యేకంగా జెప్పాలా గురూజీ. బావ కవితలూ,పైత్యపు కతలూ అన్నీ రాసేది ఎందుకె అంటే అందుకే అని డాక్టర్ భ్రమరం ఎప్పుడో జెప్పాడు గురూజీ. అంది సుధా.
NBఇది ముగ్గురు బ్లాగర్లు కలిసి రాసిన పేరడీ. ఎవరెవరో కనుక్కున్నా వాళ్లకి "బ్లాగు వినోద" బిరుదు ఇవ్వబడును. లేడీ బ్లాగర్ అయితే జాకెట్ల పండగ లో ఫ్రీ పాస్ ఇవ్వబడును.
Add starLikeShareShare with note