అవసరం అయిన సమయంలో టక్కున లేచికుచోవాల్సిన మా అబ్బాయి అలిగి పడుకుంటే నా పరిస్తితి చూడాలి .అన్ని సిద్దం చేసుకుని ఇంక భోజనం చెయ్యటానికి రెడీ అవుదామంటే మా వాడు అస్సలు లేవడు , వాడు లేస్తే గాని ఛీ పని అవ్వదు .
వాడేప్పుడు అంతే సరైన సమయం చూసి పరువు తీస్తాడు , మొన్నటికి మొన్న మా పక్కింటి పంకజం వచ్చి మీ వాడి చలాకి తనం చుపేట్టమంటే సిగ్గు పడి పోయి ములగ దీసుకుని పడుకున్నాడు వెదవ .
అక్కడకి పంకజం మా వాణ్ణి పరీక్షగా చూసి పుట్టు వెంట్రుకలు తీయ్యించక పోవడమే మీ వాడి బద్దకానికి కారణం అని తేల్చేస్తే మొన్న నే మొదటి సారి జడలు గట్టి పోయిన ఆ గుబుర్ని తీసేయించా. ఇప్పుడు చూడడానికి తెగ ముద్దోస్తున్నాడని ఇరుగు పోరు గు అమ్మ లక్కలు మా వాణ్ణి ముద్దు చేస్తూ తెగ నలిపెస్తుంటే అలసి పోక ఏమవుతాడు.
గంట కింత అని మాట్లాడి మరి రప్పించా వీడు ఎక్కి ముచ్చట తీర్చుకుంటాడు కదా అని .వీడు లేచి చస్తే గా ఇంకేంటి ఎక్కేది ..డబ్బులిచ్చి పంపెద్దమనుకుంటే, వొక్క సారన్నా ఎక్కక పొతే డబ్బులెలా తీసుకుంటాం , కనీసం ''పోంయి పోంయి" అని ఆ హార్న్ అన్నా వత్తించండి దెబ్బకి లేచి కుర్చుంటాడని ఆ కాబ్ వాళ్ళు వొకటే గోల .
పని అయిపోతే వేరే బేరాలు చూసు కుంటారట . . ఎవరి పని ? వాళ్లదా?మా వాడిదా?లేస్తే గాని పని అవ్వదు. పని అయితే గాని వాళ్ళు వెళ్ళరు . బి పి రైజ్ అవుతుందా అవదా పని అవ్వక?
అసలు మా వాడు సరైన సమయానికి లేవకుండా ఎందుకు అలిగి పడుకుంటాడు?దీని వెనక ఏవైనా సైంటిఫిక్ కారణాలు వున్నాయా అని మా వాణ్ణి చూపించడానికి డాక్టర్ వివరం దగ్గరకి తీసుకెళ్ళా .మా వాడికి ఏమి పడదో అడిగితె . పెరుగు కక్కేస్తాడు , అప్పుడప్పుడు మజ్జిగ కుడా కక్కేస్తాడు . ఎందుకిలా?అని అడిగితె ఎక్కువగా భోజనం దొరికినప్పుడు మజ్జిగ కక్కేస్తాడు , తక్కువగా దొరికినప్పుడు పెరుగు కక్కేస్తాడు .అందుకని మీ వాడు అసలు కక్కకూడదు , ఎప్పుడు యాక్టివ్ గా లేచి కూర్చోవాలి అంటే మీ పనిమనిషిని మానిపించేయ్యన్డి అంటే ఆశ్చర్య పోవడం నా వంతు అయ్యింది .
మా వాడు చురుకుగా వుండి లేవక పోవడానికి , మా బక్క పనిమనిషి కి ఏవిటి సంభంధం డాక్టర్ ? అంటే ఆమె పోషకాహార లోపం వల్ల మీవాడి కేసి చూసి దిష్టి కొడుతోంది . అందుకే దాని ముందు మీరు భోజనం చెయ్యకండి అన్నాడు .
మా వాడు కుడా ఎప్పుడు బయటకు వెళ్లి ఎరగడు .పక్కింటికి , ఎదురింటికి తప్ప .అలాంటిది వొక రోజు మా వూరు పక్కనే వున్న చిలకలూరి పేట వెళ్ళవలసి వస్తే గజ గజ లాడి పోయాడు .చిలకలూరి పేట అంటే మాటలా? యెంత డబ్బు ఖర్చు? వెళ్లి వచ్చాక ఆ కొండలు గుట్టలు పడక రోగం వస్తే?అందుకే మా వాడు చిలకలూరిపేట వెళ్లి వచ్చిన దగ్గరనుంచి అలిగి లేవడం మానేసాడు .
పక్కింటి పంకజం , ఎదురింటి సావిత్రి యెంత సవరదీసినా ప్రయోజనం లేక పోయింది . వాడేప్పుడు అంతే వాడంతట వాడు లేవ వలిసిందే గాని ఎవరన్నా లేపబోతే వాళ్ళ చేతులు నేప్పేట్టల్సిందే గాని వాడు మాత్రం ఇంచుకుడాకదలడు ..మీ వాడు నిద్ర పోవడానికి తప్ప ఎందుకు పనికి రాడు అంటూ వాళ్ళిద్దరూ తిట్టుకుంటూ పోయిన సందర్బాలు ఎన్నో .
మా వాడు అంత లేపినా లేవక పోడానికి కారణం నిద్రలో మంచి కలలు కనడమేట .వొక అందమైన రాకుమారి , రా రా మగ దీరా అంటూ గుర్రం మీద పాడుకుంటూ వస్తే మా వాడు ధభల్న ఎగిరి దాన్ని ఎక్కేసి (గుర్రాన్ని)అది అలసి పోయే దాక స్వారి చేసి రాకుమారికి మాత్రం సారీ అని చెప్పేవాడట . దాంతో రాకుమారి ''చీ దుర్మార్గుడా నన్నడగ కుండా నా దాన్ని ఎక్కే స్తావా,నువేక్కిన మంచం మీద ఎప్పటికి లేవవు గాక అని శపించిందట .''
మా వాడు ఎప్పుడెప్పుడు అలిగి పడుకుంటాడో చూడండి
పంకజం , సావిత్రి కలిసి వచ్చినప్పుడు
.పనిమనిషి రానప్పుడు
.పాల అమ్మాయి పాలు తేనప్పుడు
.వాడు పెరుగో , మజ్జిగో కక్కేసుకునప్పుడు
.మా వాడికి పక్క మీద మ్యాపులు వెయ్యడం ,గోడల మిద డిజైనులు వెయ్యడం చాలా సరదా.మా అబ్బాయి ఇలా అస్తమాను పడుకుని నా పరువు తీస్తాడనుకుంటే అసలు పెళ్ళే చేసుకునే వాణ్ణి కాదు .దసరా సెలవులు సరదా గా గడుపుదామనుకున్న ఖర్మ వీడిని సవర దేయాడానికే సరి పోతోంది ఇంక సరదా కూడాను . ఛీ ఛీ....... వెధవ బతుకు.
మొన్నటికి మొన్న పంకజం టీచరు ట్యూషను చెప్పటానికి మంగళ వారం వస్తుందని మర్చిపోయి సోమవారమే లేచి కూచున్నాడు. ఈరోజు సోమవారం రా అంటే వినడు. ఏం చెయ్యాలి? అబ్బబ్బ వీడితో వేగలేక పోతున్నానంటే నమ్మండి. ఎం చెయ్యాలో తోచక నా మనసులో మాట మీతో పంచుకుందామని .