2, అక్టోబర్ 2009, శుక్రవారం

దిక్కుమాలిన బ్లాగరి

అర్దరాత్రి అమావాస్య వొక దుర్ముహుర్తన వొక దిక్కుమాలిన బ్లాగరి బ్లాగ్లోకం లోకి అడుగు పెట్టింది .యెడ పెడ దడ దడ గేదె పేడ వేసినట్టు రాసి పారేసింది .కొంత మంది కుర్ర పినుగుల్ని చేరదీసి ,తను స్వయం గా చెయ్యగా కుక్కలు కూడా ముట్టని అప్పచ్చులు ని వాళ్ళకి తినిపించి తను ఏమి చెత్త రాసినా వా వా వా అని తలో నాలుగు కామెంట్స్ రాస్తే దానికి బదులు గా మీ బ్లాగ్ రూపు రేఖల్ని అందం గా తీర్చు దిద్దుతానని హామీ ఇస్తే సర్లే ఆంటీ ముచ్చట ఎందుకు కాదని వాళ్ళు అలాగే రాసేవారు .దాంతో బ్లాగ్ లోకం లో తను మకుటం లేని మహారాణి అని శాప వసాత్తు ఇక్కడ ఏడ్చింది గాని వాస్తవానికి సినిమాలకి ,టీవీ లకి రాసుకోవలసిన దాన్ని అన్న బ్రాంతి లో బతికేది .దానికి వంత పాడుతూ వొక తమ్ముడు లాంటి బ్లాగర్ అక్క ని గత జన్మ ఏమిటో తెలుసు కోవాలని తెగ ఇది గా వుంది , మన వూళ్ళో కి'' వైదీశ్వరన్ కోయిల్ '' నుంచి నాడీ శాస్త్రం చూసి చెప్పే ఉద్దండులు వేంచేసి వున్నారు నువ్వు ఏవన్నా సరే వెళ్లి ని గత జన్మలో ఏ సంస్థానానికి మహారాణి వో తెలుసుకుని ఆ విషయాలు ని బ్లాగ్ ద్వార ని దురభిమానుల అందరకి తెలియ చెయ్యాలి అనడం తో ఆవేశం తో ఇంటి ముందు ఆపిన రిక్షా ని తొక్కుకుంటూ (స్కూటర్ అనుకుని లెండి)విద్వానులు బస చేసిన హోటల్ కి వెళ్లి తన నాడీ గ్రంధాన్ని తీసి తన గుట్టు రట్టు చెయ్య మని కోరుకుంటుంది .

ఆమె నాడీ గ్రంధం తీసుకుని వస్తు చదివిన లింగం మూర్చ పోతాడు . వెంటనే అతని గురువు వెలమకన్ని నీళ్లు జల్లి తెప్పరింప చేసి భయపడకు చెప్పు అంటూ సౌజ్న చేస్తాడు .లింగం గుండె దిటవు చేసుకుని ఆమె గత జన్మ రహస్యం విప్పుతాడు .(ఇంకావుంది )( బేతాళుడు తిరిగి చెట్టెక్కాడు)