7, అక్టోబర్ 2009, బుధవారం

మరువలేని మూడురాత్రులు

మధ్యానం మూడు గంటలకి ఎందుకో మెలుకువ వచ్చేసింది .




ఇంక నిద్ర పట్టడం లేదు



సాధారణం గా నేను భోజనం చేసాక కచ్చితం గా వొక గంట నిద్ర పోతాను .అటువంటిది ఆ రోజు నాకు అరగంట కే మెలుకువ వచ్చేసింది .గతం లో ఇలా చాల సార్లు జరగటం వెను వెంటనే ఆమె నుంచి ఫోన్ రావడం జరిగేది .



జేబు లో చెయ్యి దూర్చి వొక సారి తడుము కుని చూసుకున్న వుందో లేదో అని...... సెల్లు . నేను చెయ్యి పెట్టడం అది ''లవ్ టు లవ్ మే బేబీ '' అన్న పాటతో మోగడం తో కన్ఫరం అయిపోయింది ఆమె ఫోన్ చేస్తోందని , ఎందు కంటే ఆమె నెంబర్ కే నేను ఆ రింగ్ టోన్ పెట్టుకున్నా .



''మా ఆయన లేరు వెంటనే వచేయ్యి , గంట లో పని అయి పోవాలి '' అది అబ్యర్దనొ?ఆర్డరో?అర్ధం చేసుకునే లోపే ఫోన్ పెట్టేసింది .అయిదు నిమిషాల్లో తయారై ఆమె బెడ్ రూం కి చేరుకున్నా.అప్పుడు మొదలయ్యిన పని మూడు రాత్రుల తర్వాత పూర్తి అయ్యింది .యి మూడు రాత్రులు ఎప్పుడు తిన్నానో ?యెంత తిన్నానో?నాకే తెలిదు .నిద్ర పోయింది కొన్ని గంటలు మాత్రమె .



అసలు వాళ్ళ ఆయనికి తెలీకుండా నాకు ఆ పని చెయ్యడం సుతారము ఇష్టం లేదు .కాని తను మాత్రం వాళ్ళ ఆయనికి ఎట్టి పరిస్థితుల్లో తేలికుడదన్న కండిషన్ మీదే నాకు అవకాశం ఇచ్చింది .ఆ మూడు రాత్రులు ఆమె ఇచ్చిన కోపెరషన్ మాత్రం మరువ లేనిది .ఆ మూడు రాత్రులు వాళ్ళ ఆయనకీ నైట్ డ్యూటీ అవడం తో నా పని సులభం అయ్యింది .మోకాలి నుంచి పాదాల దాక చేత్తో పావుతుంటే ఆమె మొఖం లో కలిగే భావాల్ని నే వర్ణించ లేను .



ఆమె కి అసలు కేరళ పద్దతి అంటే అంత ఇష్టమని అప్పుడే తెలిసింది .పని అయిపోయాక పక్క మీద దుప్పటి మోకాళ్ళ దగ్గర తడి గా అయిపోయేది .అసలు నే చేస్తున్నది కర్రెక్టేనా?నేను మద్యలో దూరడం వల్ల తన కేమన్నా నష్టం జరిగి మొదటికే మోసం వస్తే .నిద్ర హారాలు లేకపోతె పోయే ,నా పని నేను నిక్కచ్చి గా చేస్తున్న అన్నఆత్మ తృప్తి కలిగేది .నేనెంత గట్టి గా చేసిన నవ్వుతు భరించేది , ఆ మూడు రాత్రుల నా అనుభవం రాస్తే పెద్ద పుస్తకం అయ్యేలా వుంది .



ఎంతొ మంది తో నాకు అనుభవమే యి పనిలో కాని ఇమే తో అనుభవం మాత్రం మర్చి పోలేనిది .పని మద్యలో వుండగా వాళ్ళ అయన వచ్చి తలుపు గోడితే అన్న ఆలోచన వచ్చి నప్పుడు చమటలు పట్టేవి కాని అవి పని లో పట్టిన చమటల గా వూహించుకుని ముందుకు పోయా.అలా ఆ మూడు రాత్రులు విజయవంతం గా నా పని పూర్తి చేసి నేను వెళ్తుంటే ఆమె గుమ్మం దాక వచ్చి నాకు వీడు కోలు పలకడం తో నా కృషి ఫలించి నట్టే అని భావించొచ్చు .



కార్ గుద్దడం తో నరాలు చిట్లి చచ్చు బడిన ఆమె కాలు నా కేరళ పద్దతి లోని ఆయుర్వేద మందు మద్దనాతో మామూలు స్తితి కి తీసుకు రావడం నా విజయం గానే భావిస్తా .వాళ్ళ అయన అప్పటి కే neuro పతి మందులు మొదలెట్టడం తో ఆయుర్వేదం మీద నమ్మకం లేక అయన లేనప్పుడే సాధ్య పడింది మరి ఆ పని .ఇది క్లుప్తం గా మూడు రాత్రుల చరిత్ర .

నా'' ఆలోచనా తరంగాలు'' సరిగానే అర్ధం అయ్యాయని భావిస్తూ మీ కాగడా .