"నీ కోసమే నే జీవించునది ,నీ విరహములో నీ ద్యాసలో"-- అని సిని కవి చెప్పినట్టు గా నా కిష్టమైన ఆ బుజ్జికన్న ని వదిలి అన్ని రోజులు వుండవలసినపరిస్థితులు వస్తాయని నేనెప్పుడు అనుకోలేదు .
తప్పని సరి ప్రయాణం , కాదనలేని శోభన కార్యం , చీ ఛి నా మతి చెడ శుభ కార్యం ఏంటో ఇన్ని రోజుల విరహం తో అచ్చు తప్పు తోంది .ట్రైన్ కి కార్ తీసుకుని బావ వచ్చాడు , చినప్పుడంతా ఆడుకున్న ఆ పచ్చటి పొలాలు ,జీళ్ళు కొనుక్కుని కాకి ఎంగిలి చేసుకుని తిన్న కిళ్ళి కొట్టు చూసి బావ ''ఉష నీకు ఆ రోజులు గుర్తు వున్నాయా?మన కాకి ఎంగిలి జీళ్ళు '' అంటు ఏదో చెప్పుకు పోతున్నాడు .
నాకు విసుగ్గా వుంది మాటి మాటికి నేను తడిమే ఆ భుజ్జి గాడే గుర్తు వస్తున్నాడు .
'' నాకు గుర్తు లేవు , చెత్త విషయాలు నేను గుర్తు పెట్టుకోను '' సూటిగానే తగిలిందేమో బావకి మళ్ళి నోరు ఎత్తకుండా డ్రైవ్ చేస్తున్నాడు .ఇప్పటికే యిరవై నాలుగు గంటలై పోయింది దాన్ని ముట్టుకుని .
ఇంతలొ పెళ్లి మండపం రానే వచ్చింది .ఎవరి హడావిడిలో వాళ్ళు వున్నారు .నా కళ్లు మాత్రం దూరం గా లాప్ మీద పెట్టుకుని టాప్ లేపుస్తున్న అతని మీదే పడ్డాయి .ఇది కలా నిజమా అనుకుంటూ దగ్గర గా వెళ్లి చుస్తే నిజమే అతనూ నా లాగే బుజ్జి గాన్ని పట్టుకుని కుమ్మేస్తున్నాడు .
దగ్గ రాగా వెళ్లి ''ఏవండి కొంచెం పక్కకి వస్తారా?''
నా పిలుపు విన్న అతనూ కంగారు పడుతూ'' అమ్మో మా శ్రీమతి తో వచ్చానండి పెళ్ళికి , మీ సెల్ నెంబర్ వుంటే ఇవ్వండి కొంచెం టచ్ లో వుందాం ''అంటుంటే
'' అబ్బెబ్బే అలాంటి దాని కోసం కాదండి ,మీ laptop వొకసారి ఇస్తే నా లేటెస్ట్ పోస్ట్ ''ద్వితీయ విగ్నానికి '' ఎన్ని కామెంట్స్ వచ్చాయో చూసుకోకపోతే పిచేక్కి పోతుందండీ , ప్రతి అరగంట కోసారి చూసుకుని మురిసి పోవడం అలవాటయ్యింది ''
అమ్మో మీకు కూడా బ్లాగ్ ఎటాక్ వచ్చిందా?నాది అదే జబ్బుఏదన్నా కాంట్రవెర్సి టాపిక్ మీద రాసి దాని మీద జనాలు కామెంట్స్ తో కుమ్ముకుంటుంటే చూసి ఆనందిచడం నా అంతర్ముఖం , కాని దురదృష్ట వశాత్తు ఇక్కడ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవటం లేదు ''అంటు ఆమెని పైనించి కింద దాక సొంగ కార్చుకుంటూ చూసేస్తున్నాడు
అమ్మో రావు గారు మీరా?మీ సొంగ చూసి గుర్తు పట్టా నా బాధ ఏంటంటే ఈనాడు లో ఆడ బ్లాగర్లు గురించి ఇంతకు ముందు జర్నలిస్టు గా పని చేసి'' వయసులో మాట '' అనే బ్లాగ్ రాసే ఆవిడ నా గురించి వొక్క మాట కూడా రాయకుండా తొట్టి గ్యాంగ్ లీడర్'' గల్ల భోజు '' ఆరుగుర్ని మైంటైన్ చేస్తుందని గొప్ప గా రాసింది .
కేవలం వాళ్ళ గ్యాంగ్ సభ్యుల బ్లాగుల గురించి , వోకతో ఆరో బయట వాళ్ళ బ్లాగుల గురించే రాసారు గాని కాగడా ని అభిమానించే చిన్ని బ్లాగ్ గురించి గాని ,కవితలతో నెట్టుకొచ్చే పద్మార్పిత గురించి గాని ,వోబమా కి నోబెల్ బహుమతి రావడం వెనక రామోజీ కుట్ర అంటూ రాసుకునే ''నాన్నవడి'' బ్లాగర్ గురించి గాని ,కొంతమంది కి మాత్రమె చూపించే ''నేను-టచ్ మీ '' గురించి గాని ,నిహారికా స్వప్న బ్లాగుల గురించి గాని ,''నేస్తం'' నీగురించిమళ్ళి కాగడ ని తిట్టి నప్పుడు చూస్తాం అంటూ ఎందర్నో విస్మరించి ఇంటికి పిలిచి దోసలు తినిపించిన వాళ్ళ ని ఆకాశానికి ఎత్తేసి మిగత వాళ్ళని కుదేసి
అప్రయత్నం గా నా కళ్ళ లో నీళ్ళు వస్తుంటే ఇదే సందనుకుని రావు దగ్గర గా వచ్చేసి హత్తు కున్నంత పని చేసి బాధ పడకండి , గుండె దిటవు చేసుకోండి ,ఆ గల్లభోజు రాబోయే ఆంధ్ర జ్యోతి ఛానల్ లో తన వంటల తో జనాల్ని చంప బోతునట్టు ఇంకెవరన్నా కుతి తీర్చుకోవాలంటే ఈనాడు వదిలేసి ఆంధ్రజ్యోతి లో జాయిన్ అయిన సుమన్ నెంబర్ ఇదిగో చంపుకోండి అంటూ ప్రకటించేసింది అంటూ నా కళ్లు తుడవ బోతుంటే చటుక్కున తప్పుకున్న కాబట్టి సరి పోయింది లేక పొతే అప్పుడే అక్కడకి వచ్చిన మా వారు చూసుంటే పెళ్లి లో పెద్ద రాద్దంతమే అయ్యేది .
ఎట్ట కేలకు అన్ని కార్యక్రమాలు పూర్తీ చేసుకుని వెళ్లి పోదమనుకుంటుంటే అయ్యో ఇంత దూరం వచ్చాక ఆ శోభనం కూడా చేయించి వెళ్ళండి అంటే మా అయన తెగ వుత్సాహ పడి పోయి పోనీ అలాగే కానిద్దాం అనేటప్పతకి ఇంకో రోజు ఆలస్యం అయిపోయింది .
ఇంక వొక్క రోజు కుడా ఆగలేను అనుకుంటూ వెంటనే కార్ ఎక్కి , రైల్ ఎక్కి ,ఇంటికోస్తూనే బాత్రూం కి కుడా పోకుండా మా బుజ్జి గాన్ని లేపి వాణ్ణి నొక్కే దాక నా మనసు కుడట పద లేదు . ఇప్పుడు మీకు అర్ధం అయ్యిందనుకుంటా మా బుజ్జి గాడు అదేనండి మనల్ని అందర్నీ ఏ దరి లో వున్నా కలిపి e జబ్బు అంట గట్టిన కంప్యూటర్ కదంబ రావు .