21, సెప్టెంబర్ 2009, సోమవారం

క్షతగాత్రురాలు

ప్రేమ వలదని కామం నీవే కోరితివి


డబ్బులడిగితే మొహం చాటేస్తివి



నీకోసం ఎదురు చూసి ఎదురు చూసి

ఏ నిశి రాత్రికో మాగన్నుగా నిద్రపట్టింది

ఇంతలొ హృదయం బరువైంది

కాళ్ళూ చేతులూ వణకటం మొదలైంది



ఆనందాన్ని ఆస్వాదించే లోపే

అన్నీ అయిపోయిన భావన

నీ యుగాంతాల ఎదురు చూపుల్లో

నాకు దక్కింది ఇదా



పొద్దున్నే లేచి కలా నిజమా అనుకునేంతలో

ఒళ్ళు నెప్పులు చెప్పాయి ఇది నిజమేనని

అప్పుడర్థమైంది నిజంగా

నీ దగ్గర డబ్బుల్లేవని



ఇల్లు చిమ్ముతుంటే దొరికింది

నీ తాయేత్తుల సంచి

పనై పోగానే పారిపోయావా

పరమేశ్వరా నన్ను ముంచి