16, సెప్టెంబర్ 2009, బుధవారం

మందు మాట


మందుమాట .

ముందుమాట అనబోయీ..

అయినా మందు కొడుతూ రాస్తే ఇలాంటి తప్పులే వస్తాయి.

స్తబ్డు గా వున్న బ్లాగ్లోకాన్ని జాగృతం చేసి

దుమ్ము కొట్టుకు పోయిన ధూం లను తధిగిన తోం అని మళ్లీ డాన్స్ చేసే లా చేసి

తుప్పు పట్టిన కత్తులకు సాన పట్టి

మహేశ్వరా పరమేశ్వరా అనుకుంటూ

నీరు గారి పోయి ఆరి పాయిన జ్యోతుల్ని వెలిగించి

కేలకడానికి ఏమి లేక కేకలు వేసే రౌడిలకి చేతీ నిండా పని గల్పించి ,

కోతి గాళ్ల కేతి గాళ్ళకూ గుర్తింపు ఇప్పించి

బ్లాగ్ లోకం అంతా మనసార నవ్వుకుంటూ రేపొద్దున్న కాగడా వ్యంగ్యం ఎవరి మీదో

అని అందరూ ఎదురు చోసేలా మీ మది దోచేలా నే రాస్తే పోలా?



అంటూ రాసేలోపల శిష్యురాలు సోడాలోకి మందు పోస్తుంటే, అలా కాదమ్మా, మందులోకి షోడా పొయ్యాలి. సోడా లోకిమందు పొయ్యకూడదు. అన్నాడు కాగడా.

అప్పుడు శిష్యురాలు, అదేంటి గురువర్యా. మందోచ్చి సోడాలో పడినా సోడా ఒచ్చి మందులో పడినా మీరొచ్చి నా మీదేగాపడేది మందేక్కువైందని. అయినా ఆరోగ్యం చూసుకోరూ అంటూ సోడాలూ మందులూ తీసుకొని వెళ్ళిపోయింది.



కాగడా గారు స్టడీ స్టడీ రాక్ స్టడీ అంటూ నిలబడుతుండగా దభీ మని సబ్దం వచ్చింది . చూస్తె శిష్యురాలు కాలు జారింది. కాగడాకి నడుం జారింది.



రేపు అనంతమైన వయసు ముచ్చట్లు....టా టా.