17, సెప్టెంబర్ 2009, గురువారం

వయసు ముచ్చట్లు

నాలో ఆ భావాలూ ఆ ఆ లు దిద్దుకుంటున్న వయసది .


కౌమారం లో కదలికలు మొదలైన క్షణం అది (మనసులో లెండి).

**************************************

అమ్మ నాన్న, అక్క స్నేహితులు వస్తే డొక్కలో పొడిచి లోపలికి పంపే రోజులవి.శరీరం లో వింతైన ఘాటైన వాసనలు మొదలైన తోలి రోజులవి.లోకమంతా మత్తు గా గమ్మత్తుగా కనిపించే రోజులవి .

***************************************

అటువంటి వొక రోజు నేను స్కూల్ కి వెడదామని రెడీ అయ్యి గుమ్మం దగ్గరకి వెళితే అడ్డం గా నాన్న నిలబడి వుంటే



"నాన్న కొంచెం జరగరా " అన్నా

చలనం లేదు.

బహుశా నాకు లెక్కల్లోమొదటి సారి నూటికి వొక మార్క్ తగ్గి తొంబైతొమ్మిది వచ్చిందని దిగులు పడుతూ ఆలోచిస్తున్నారనుకుంటా.

" లేదు నాన్న గారు ఇంకెప్పుడు వందకి తగ్గనివ్వను , నన్ను క్షమించండి "

అంటూ అయన కాళ్ళ మీద పడి భోరున ఏడవాలని పించినా సంభాళించుకుని , మెల్లిగా అయన వీపు మీద తట్టి

" నాన్నగారు మీరు పక్కకి జరిగితే నే స్కూల్ కి వెళతా" అన్నా .

ఆయన మొఖం లో తొట్రుపాటు ...

అంతవరకు ఎక్కడో చూస్తూ వున్నా ఆయన " బాబు ఈ అయిదు వుంచుకో ఏదన్నా ఇంటెర్వల్ లో కొనుక్కో " అంటే ఆశ్చర్య పోవడం నా వంతయ్యింది.

ఎందుకంటె ఏ నాడు నాకు స్కూల్ కి పిప్పెర్మేంట్ కి కూడా డబ్బులు ఇవ్వని వ్యక్తీ యి రోజు యిలా ??

***************************************************************************

మా ఇంటి ముందు రోడ్ దానికి పక్కనే మురికి కాలవ , ఆ కాలవ కి అటు పక్కనే సినిమా హోర్డింగ్స్ పెద్ద పెద్ద వి .బయటకు వస్తూనే ఎదు రు గా చుస్తే నరాలు జివ్వి మనేలా సినిమా పోస్టర్లు .ఆ రోజు బయటకు రాగానే సీత కోక చిలుక , రామ్ తేరి గంగా మైలి ,వాల్ పోస్టర్ల తో పాటు నేనెప్పటికీ మరచి పోలేని వాల్ పోస్టరు అంగడి బొమ్మ లో సీమ చిన్న చొక్కా మాత్రమే తొడుక్కుని తొడల నుంచి మొత్తం కనబడేలా నిలబడే ఆ భంగిమ బహుశా మా నాన్న ఇందాకటి నుంచి అదే వాల్ పోస్టర్ చూస్తూ నేను పిలవగానే తొట్రు పాటు పడ్డాడు లాగుందే?

చ. చ. తను శ్రీ రామ చంద్రుడు. అలాంటి వాడు కాదు .

నా మస్తకం లో ఈ పుస్తకాల బదులు వాల్ పోస్టర్లు దూరేస్తున్నాయి.

నడుచుకుంటూ స్కూల్ కి వెళుతుంటే శీను గాడు కని పించి



" ఒరేయి రాష్ట్ర పతో , మంత్రో ఎవరో చని పొతే హాలిడే ఇచ్చేసారు మనం అంగడి బొమ్మ కి పోదాం " అన్నాడు . నేను అంగడికి పోయి బొమ్మ కొందాం అంటున్నాడనుకుని " సరే రా " అని వాడిని అనుసరించా .

తీరా చుస్తే వాడు సినిమా దియేటర్ కి తీసుకెళ్ళాడు .



అక్కడ బుకింగ్ కౌంటర్ దగ్గర అంతా నెత్తి మీద తుండు గుడ్డలు కప్పుకుని మరి లైన్ లో నిలబడి వున్నజనాలు కనిపించారు . వాతావరణం చుస్తే వాన లేదు , ఎండా లేదు.



"మరి ఈ తుండు గుడ్డ లెంట్రా? "అని అడిగా ఇక్కడ బొమ్మలు ఎవరు అమ్ముతారా అని ఆలోచిస్తూ



దానికి శీను గాడు బాగ్ లోంచి రెండు గుడ్డలు తీసి నా నెత్తి మీద వాడి నెత్తి మీద మొఖం కనబడ కుండా వేసి " ముందు టికెట్స్ తీసుకుని లోపలికి వెళితే లక్కీ డ్రా లో నెంబర్ వస్తే బొమ్మ ఇస్తారు " అంటే అమాయకం గా నమ్మేసి లోపలికి పోయా .



లోపల సినిమా మొదలవ్వ గానే చీకట్లో జనాలు నెత్తి మీద గుడ్డలు తీసేసి సినిమా చూడడం లో నిమగ్నం అయ్యారు .నాకేమో చచ్చే భయం గా వుంది అమ్మ నాన్న కి తెలిస్తే చీరేస్తారు , దొంగ తనం గా సినిమా అది కుడా సగం గుడ్డల సినిమా .



శీను గాడు మాత్రం ఇవి ఏవి పట్ట నట్టు గా సీట్ ముందు కి వెళ్లి , మద్య మద్య లో కిందకి వంగి మరి చూస్తున్నాడు వెదవ



ఇంతలొ ఇంటెర్వల్ రాగానే జనాలు మళ్లి తుండు గుడ్డలు నెత్తి మీద వేసేసుకున్నారు.మా శీను గాడు నా పోరు పడలేక పక్క ఆయన్ని " టైం యెంత " అని అడిగాడు



ఆయన నెత్తి మించి గుడ్డ తీసి పన్నెండు అన్నాడు. అంతే!! నా గుండెల్లో రాయి పడింది , అది మా నాన్న గొంతు ... చూస్తె ఆయనే . నా చూపులు అయన చూపులు వొకే సారి కలవడం ఇద్దరం వొకే సారి నెత్తి మీద గుడ్డలు వేసేసుకోవడం జరిగింది.



తేలుకుట్టిన దొంగల్లా పక్కకి చూడ కుండా కూర్చున్నాం .నా కైతేపయిప్రాణాలు పైనే పోయాయి . ఇప్పుడెలా?ఆయినా నేనెందుకు భయ పడాలి ? ఆయన కదా అమ్మకి తెలీకుండా ఇలాంటి చెత్త సినిమాకి వచ్చింది?ఆయన స్థితి కూడా ఇలా భయం గానే వుంటుందేమో?అయ్యో నాన్న శ్రీ రామ చంద్రుడు అనుకున్తోందే అమ్మ.



యియన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య నా?యి భయం తో ఎప్పుడు సినిమా అయ్యిందో కూడా తెలిలేదు .పక్కకి చుస్తే నాన్న ఎప్పుడో జంప్ అయి పోయడనుకుంట పత్తా లేడు . ఇంట్లోకి భయం భయం గా అడుగు పెట్టిన నాకు నాన్న ఏమి జరగనట్టే ,ఆ సినిమాహాల్లో కనిపించింది తను కాదేమో అన్నట్టు బెహేవ్ చేస్తున్నాడు. అసలు ఆ వ్యక్తీ నాన్నో కాదో?ఏది ఏమైనా అప్పటి నుంచి నాన్న గదమాయింపు పూర్తీ గా తగ్గి పోవడమే కాకుండా అక్క స్నేహితురాళ్ళు వచ్చినప్పుడు నేను కొత్త గా కుట్టించుకున్న పాంట్స్ వేసుకుని కళ్ళలోకి కళ్లు పెట్టి చూస్తున్నా కూడా కళ్లు ఎర్ర జేసి లోపలికి ఫో అని మాత్రం అన లేక పోతున్నాడు.



దొంగ తనం గా సితార చూసే స్థాయి నుంచి ధైర్యం గా కాగడా చూసే స్థాయికి ఎదిగి పోయా.నాన్న మాత్రం ఏమి అనేవారు కాదు " జీవితం లో మాత్రం బాగా స్థిరపడాలిరా , రెండు నిమిషాల ఆనందం కంటే , రెండు తరాలకి ఆనందం కలిగేలా జీవించాలి " అనేవారు .మనసులో ఏమి మూగ బాధ అనుభవించారో? నన్ను ఏమి తిట్టుకునే వారో అప్పుడు తెలిలేదు.

**************************************************************************************

కాల చక్రం గిర్రున తిరిగి నేను జీవితం లో బాగా స్తిర పడడం , పెళ్లి చేసుకోవడం వొక బాబు కి తండ్రి అవడం , పెళ్లి అయి ఏడు సంవత్సరాలు అవడం చేత తేనెటీగ కుట్టడం చక చక జరిగి పోయాయి.దాని ప్రభావం వల్ల రాత్రుళ్ళుఇంట్లో అందరూ నిద్ర పోయేదాకా తెలుగు బ్లాగులు చూసే నేను అందరు నిద్రపోయరని నిర్ధారించు కున్నాక debonairblog కి షిఫ్ట్ అయ్యే వాడిని



ఆ రోజు మా నాన్న శాపమో? విధి బలీయమో తెలిదు గాని ,ఆ రోజు తెలుగు బ్లాగులలో నా బ్లాగ్ గురించి ప్రశంసిస్తూ

'' కోడి కన్ను '' అన్న బ్లాగ్ లో పోస్ట్ రావడం దాని మీద ఎందరో ఆడ బ్లాగరులు మరీ నెలకోసారి వేస్తున్నారు కనీసం పది రోజులకన్నా వేస్తె (నా పోస్ట్స్ ) బావుంటుందని అభినందిస్తుంటే వొళ్ళు పైనా తెలీకుండా రోజు నే చేసే ముఖ్యమైన పని చెయ్యకుండా ,అందరూ పడుకోగానే debonair ఓపెన్ చేసేసి ..మెల్లిగా ఉచ్వాస నిచ్వసలు పెంచుకుంటూ పోతున్నా



ఇంతలొ " డాడి ఏమిటి నువ్వు చేస్తున్న "పని " అన్న అరుపుతో యి లోకం లోకి వచ్చా



చూస్తే వెనకనే మా ఆరేళ్ల అబ్బాయి !!



" వుండు అమ్మ కి రేపోద్దున్నే లేవగానే చెపుతా. డర్టీ సైట్స్ అన్ని చూస్తున్నావని" అంటు వురిమి వురిమి చూస్తున్నాడు .



నేను ఆ రోజు సినిమా హాల్లో మా నాన్న ముఖం లో వచ్చిన లాంటి తొట్రు పాటు తో " అబ్బే కంప్యూటర్ కరప్ట్ అయ్యింది రా వైరస్ వచ్చి ఏ సైట్ కొట్టినా అదే ఓపెన్ అవుతోంది " అంటు వాడేమన్నా కన్వన్స్ అయ్యాడేమో అని ఆత్రం గా చూస్తున్నా ." కరప్ట్ అయ్యింది కంప్యూటర్ కాదు నీ బుర్ర " అంటుంటే యి వెదవ టీవీ డైలీ సీరియల్స్ చూడడం తో కుర్ర వెదవలు కూడా పెద్ద మాటలు మాట్లాడేస్తున్నారు అని మనసులో అనుకుంటూ

" అవును నాన్న నువ్వు ఏదో కొక్కబుర్ అన్పని క్రికెట్ బాట్ కొనమన్నావు గా సచిన్ ఆడేది రేపే కొంటా (అది చాల కాస్ట్లీ బాట్ పదివేలు కుర్ర వెధవకి అంత పెట్టి ఎందుకని అంతకు ముందు విసుక్కున్నా లెండి)సరే దా, ఇందాకా నువ్వు పడుకునే ముందు శుషు పోయించటం మర్చి పోయా గా , అందుకే లేచి వుంటావ్ " అంటు బాత్రూం వైపు దారి తీసా.



నా ఖర్మకి రోజు చేసే ఆ ముఖ్యమైన పని మర్చి పోవడం ఏంటో?మా వాడు నేను తెలుగు బ్లాగ్స్ చూసే టైం లో లేవకుండా ఆ బ్లాగ్ చూసే టైం కి లేవడం ఏంటో? నేను చుస్తున్నవాన్ని కామ్ గా చూడ కుండా ఆ ఉచ్చ్వాస నిశ్వాసలు ఏంటో?ఏంటో చరిత్ర మళ్ళీ తిరగ బడుతోంది. అంటే ఇదేనేమో అప్పట్లో మానాన్న నాకు దొరికితే , ఇప్పుడు నేను మా అబ్బాయికి .ఎవరికైనా వయసు పిలుస్తుంది నా విషయం లో మాత్రం వయసు కరిచింది.



ఇప్పటివరకూ ఇందులో పాత్రలు మూడే. నేను మా నాన్న, మావాడు, ఇప్పుడు ప్రవేశించిన నాలుగో పాత్రతో నా జీవితంలో వయసు ముచ్చట్లు జోరందుకున్నాయి. ఆ ముచ్చట్లు ఇంకోసారి రహస్యంగా చెప్పుకుందాం.



ఇదెవరి బ్లాగులో పోస్టుకి పెరడీనో చెప్పిన వారికి అంగడి బొమ్మలో సీమ ఫోటో ఉచితంగా పంపబడును. వీ పీ(??) చార్జీలు అదనం