25, డిసెంబర్ 2009, శుక్రవారం
అమృతం కారిన రాత్రి
ఇది లాస్ట్ వీకెండ్ కారిన రోజే రాసుకున్నా కాని నీరసం వల్ల ప్రచురించ లేదు. ఇదుగో ఈరోజు ఓపిగ్గా ఇలా .....
అర్ధ రాత్రి లైటేప్పుడైనా వేశారా
పడుపు కాంత మొహాన్నేప్పుడైనా కన్నారా
మల్లె పూల మాల తురిమి
చెంగల్వ పూల చీర కట్టి
ఇప్ప పూల సారా తాగి
చొక్కా పట్టుకొని చొరవ చూపే అతివను కన్నారా
సరైన ఆకృతి లేకపోయినా
వికృతంగా ఉన్నా
మొహమాట పడుతూ కాలు జారిన
కాంత నేపుడైనా కన్నారా
జేబునుండి జారిన విత్తములు
పాల పుంతల మీద పడిననూ
సిగ్గులేక కళ్ళకద్దుకుని జేబులో పెట్టుకుంటే
వేయి గజాల పెళ్లిచీర పక్కకు పడేసిందిట.
సిగ్గులేని జయమాలిని
సింగారి జ్యోతి లక్ష్మి
నడి రాత్రి లేచిపోయెను
నీతో లాభం లేదని