16, డిసెంబర్ 2009, బుధవారం

సొమ్ము మందిది ,సోకు మాది


కాగడా స్విమ్ముంగ్ పూల్ లో ఈత ముగించుకుని పైకి రాబోతు ఉంటాడు . సగం పైకి రాగానే కెవ్వున కేక వేసి శిష్యురాలు ఉష టవల్ మీదకి విసురుతుంది .



" ఏవిటి స్వామి మీరు రోజు రోజు కి నెలల బాలుడు అయి పోతున్నారు .



" కూడు , గూడు , గుడ్డా ఇవే ప్రతీ మనిషికి కావలిసినవి .మనం ఎవరికన్నా వాటిని దానం చెయ్యాలంటే ముందు వాటిని మనం వదులుకోవాలి ".అన్నాడు కాగడా .



" అర్ధం కాలేదు స్వామి ?ఎవరికో ఇవ్వడానికి మనం వదులు కోడానికి ఏవిటి సంభంధం? "



"భగవంతుడి సృష్టిలో బాలన్స్ వుంటుంది . వొకరు కర్మ వశాత్తు కూడు ,గూడు ,గుడ్డా లేకుండా పుడితే , వాడికి అవి దక్కాలంటే అవి వున్న వాడు వీడి కర్మని తానూ తీసుకుని ,కూడు ,గూడు తజ్యించి అవతలి వాడికి దానం ఇస్తేనే అది దక్కు తుంది . లేక పొతే అది దక్కదు .యి రోజు మన ఆశ్రమానికి వొక అభాగ్యుడు వస్తున్నాడు అతనికి గుడ్డలు ఇవ్వడం కోసం నేను గుడ్డలు త్యజించా యి రోజు అదీ సంగతి అని వివరించాడు .



అంతకు ముందే వచ్చీ యి సంభాషణ వింటున్న రమణి " అయితే స్వామి మా వనం వాళ్ళ తరఫున ఆవిడెవరో అర్దరాత్రి దొంగ తనం గా కప్పినవి ఆ ముష్టి వాళ్ళకి దక్కవా? " అడిగింది



చిద్విలాసం గా నవ్వినా కాగడా " సరే జరిగింది చూపుతా చూడు " అంటూ మాయాబజార్ లో పెట్టి లాంటిది తీసాడు .



అందులో దృశ్యం ..........



అసహనం గా గదిలో కదులుతోంది ఆవిడ



ఇప్పటికే వనం సబ్యుల దగ్గర సామాజిక కార్యాల కోసం అని చాల డబ్బులు పోగేసాను , ఏదన్నా కార్యం చేసి ఖర్చు పెట్ట క పొతే ?నాలుగు డబ్బులు వెనక వేసు కునె దేలా?నాకు ప్రచారం వచ్చే దేలా?ఇంతలో



మాదా కబళం తల్లి ,మీరు ప్రయోగాలు చేసిన వాటిలో ఏదన్నా మిగిలి పొతే పడెయ్యండి అమ్మా , అసలే చలి చచ్చి పోతున్నా అంటూ ఎవడో ముష్టి వాడు గుమ్మం ముందు అరుపు లు .



ఆవిడకి చచ్చే విసుగు వచ్చింది " పోరా ముష్టి వెదవ , నా ప్రయోగాలూ అంటూ వెటకారమా , ఆ మిగిలి పోయిన వన్ని మా వనం సబ్యులకి ఆదివారం రోజు మీటింగ్ లో ఎలాగు పెడతాను .నువ్వు ఫో "



పోనీ పాత దుప్పటి అన్నా?



"ఆ దుప్పట్లో వడియాలు ఆర బెట్టుకుంటా నువ్వు ఫో ఇక్కడి నుంచి దరిద్రపు వెదవలు " అంటూ తలుపు ముసేసిన్డి .సరిగ్గా అప్పుడే వొక దరిద్రపు ఆలోచన ఆవిడ తలుపు తట్టింది .వెంటనే కొడుకుని పిలిచి ''యాదగిరి బ్రదర్స్'' షాప్ కి వెళ్లి నే పంపించానని వొక వంద బ్లాంకెట్ లు పట్టుకురా అనగానే



నావల్ల కాదె అవి సైకిల్ మీద వేసుకుని నేను అమ్మ లేను అన్నాడు .



నీ మొహం దాని కోసం కాదు గాని నువెళ్ళి చెప్పింది చెయ్యి నేను యాదగిరి తో మాట్లాడతాను అని పంపింది .





కొడుకు వంద బ్లాంకెట్ లు తీసుకుని బిల్లు ఎంతన్డి అని అడిగితె వెయ్యి రూపాయలు అంటాడు యాదగిరి . కళ్ళు తిరిగీ పడి పోతాడు కొడుకు . నీళ్ళు మొహం మీద కొట్టాక తేరుకుని " అదేంటి వంద బ్లాంకెట్ లు వెయీ

రూపాయలేనా?అడుగుతాడు .అవును మీ అమ్మగారు రెగ్యులర్ కస్టమర్ కాబట్టి గంటకి బ్లాంకెట్ కి పది రూపాయలే అద్దె గా తీసుకుంటున్న అదే సినిమా వాళ్ళ కైతే గంటకి వంద వసూల్ చేసేవాన్ని అంటుంటే తల్లి ఐడియా అర్ధం అయ్యి అవి తీసుకుని ఇంటికొచ్చాడు .



అమ్మ తెచ్చా ఆంటీ ల కి ఫోన్ చేసి చెప్పనా ?



నీ బొంద నువ్వు నోరు మూసుకో ఆంటీ లకి ఫోన్ ఎందుకు ?గంటకింత అని అద్దెకి తెచ్చామని తెలియ్ డానికా?ఇవన్ని వోకోటి వెయ్యి రూపాయలిచ్చి కొన్నానని బిల్లు రాసి లక్ష వసుల్ చేస్తా . అసలే అమెరికాలో డాలర్స్ సంపాయిన్చుకుంటున్నారు వొక వెయ్యి డాలర్స్ డొనేషన్ అంటే పెద్ద లెక్క కాదు వాళ్ళకి .ఇవన్ని మూడో కంటికి తేలీ కుండా మీ స్నేహితుల సాయంతో అర్దరాత్రి రెండు గంటలకి వీధి లో పడుకునే ముష్టి వాళ్ళకి మెలుకువ రాకుండా కప్పేసి ఫొటోస్ తీసేసుకుని , మన బ్లాంకెట్ లు మనం తెచ్చేసుకుని యాదగిరికి పొద్దున్నే ఆరు గంటలకి ఇచేయ్యడమే .



అమ్మా తెలిస్తే బావుండదేమోనే?



ఎలా తెలుస్తుంది రా ఆ ముష్టి వెదవలు తాడు బొంగరం లేని వాళ్ళు , వున్నావా? దమ్మేసావా? అని అడిగే వాళ్ళే లేని వాళ్ళు .వొక్క గుక్కెడు రమ్మె హాయి గా వాళ్ళని బజ్జో పెడుతుంది .పదిమందిలో ఏకాకులు . మన పని మనం కానిచ్చుకుని వచేయ్యడమే , నువ్వు నోరుమూసుకుని కెమెరా వున్న నీ స్నేహితుల్ని ఇద్దర్ని రాత్రి వొంటి గంటకి మన ఇంటికి వచ్చేయ్య మను అంటూ చెప్పడం తో సొమ్ము మందిది సోకు మాది ప్రోగ్రాం మొదలయ్యింది.



కార్ రివ్వున దూసుకు పోతూ ఫుట్ పాత్ మీద ముష్టి వాళ్ళు మునగ దీసుకుని పడుకున్న వొక చోట ఆగింది .దుప్పటి కప్పి ఫోటో తీసుకుని మళ్ళి దుప్పటి లాక్కునే ప్రయత్నం లో మెలుకువ వచ్చేసిన వొకడు పక్కనున్న వాళ్లతో ''చూసారా నేను ముందే నా బ్లాగ్ లో రాసాను పుస్తక ప్రదర్సన స్టాల్ లో సర్వీసు చేసిన వాళ్ళకి దుప్పటి యోగం పట్ట బోతోందని'' .అంటాడు ఆలోచనా తరంగాలలో తేలి పోతూ .



ఇంతలో యింకో అతను మెలుకువ వచ్చి చూడు బాబు కావాలంటే యి దుప్పటి పట్టుకు పో కాని కొంచెం పక్కకి రా అంటుంటాడు శరత్ కాలపు చలిలో .



ఇంకొక ఆమె దుప్పటిని పక్క కి తోసేస్తూ ఛి అనవసరం గా కమిట్ అయ్యా. యి బుక్ స్టాల్ దగ్గర .హాయిగా నా ఆఫీసు లో విజిటర్స్ ని ఎవర్ని రావొద్దని మా మిత్రుడి తో బ్లాగుల బాగోగుల గురించి చర్చించుకుని వుంటే బావుండేది . ఇలా రోడ్ల మీద స్టాల్ మూసేసి నిద్ర పోవడం ,ముష్టి వాళ్ళు అనుకునిఅడ్డమైన వాళ్ళు దుప్పట్లు కప్పి ఫొటోస్ తీసేసుకుని వాళ్ళ బ్లాగుల్లో వేసేసుకుంటే మళ్ళి ఆహ వోహో అంటూ మేమే కామేన్టడం చీ బ్లాగు బతుకు అనుకుంటూ పక్కకి తిరిగి పడుకుంటుంది చిన్ని చిన్ని గా గొణుగుతూ .



ఇంకో అతను దుప్పటి లాక్కో పొతే'' ఆమె ఎవరు?అతను ఎవరు? ఆమె అతను కలవకుండా ఉంటేనే బాగుంటుంది, కుటుంబ వ్యవస్థ దెబ్బ తినదు అంటూ కలవరిస్తూ ఉంటాడు రవిఎప్పుడు వుదయిస్తాడా అని ఎదురు చూస్తూ .



ఇంకో ఆమె మెలుకువ తెచ్చుకుని నాకు తెలుసు యిది రామోజీరావు కుట్ర . వాడే ఆడ వేషం లో వచ్చి దుప్పట్లు కప్పి మమ్మల్ని ముష్టి వాళ్ళ గా చూపించే నకిలీ కనికుడి వ్యవస్థ. పొద్దున్న పేపర్ లో మెయిన్ హెడ్డింగ్ విడిపోతే ముష్టి బతుకులు అని పెట్టాడు . అప్పుడే నాకను మానం వచ్చింది అంటూ అటు తిరిగి పడుకుంటుంది అమ్మవడి లో .



ఇంకో ఆమె చీ మొన్ననే థాంక్స్ గివింగ్ పండగ చేసుకుని ఇండియా వస్తే నా మొక్కలకి వేసే ఎరువంత విలువ చెయ్యని దుప్పటి కప్పి మళ్ళి లాక్కు పోతారా అంటూ కళ్ళు నులుము కుంటూ చూస్తూ వుంటుంది మరువపు వాసన కోసం .



ఇంకో అతను పైకి రౌడీ అని చెప్పుకుని బతికేస్తున్నా . మలక్పేట బ్రిడ్జి కింద మంచం కుడా లేకుండా వున్నానని చూపించ డానికే యి దుపట్లు ఫొటోస్ .నా వనం లో వెంటనే కేలకాలి రేపు పొద్దున్నే అంటూ ముసుగు తన్నుతాడు .



నా బ్లాంకెట్ తీసేసుకున్నా పర్లేదు గాని నేనుకొత్తపాళీ తో రాసిన ''బొంగు టద్దాల కిటికీ '' చదివి సమీక్ష రాయండి , ఉచితం గా ఇస్తానన్న ఎవరు తీసుకోవటం లేదు అందుకే యిలా ఫుట్ పాత్ మీద పెట్టుకున్నా అంటాడు .





ఇంకొకడు కంగారు గా లేచి తాయెత్తు ల సంచి సద్దుకుంటూ జగన్మాత కృప వల్ల దుప్పటి దొరికిన్దంటు సంచి లో సద్దేస్తాడు హర హర అనుకుంటూ .



ఇంకొకడు " బ్రాహ్మణులను ఇతర జాతి వాళ్లతో సమానం గా వొకే ఫుట్ పాత్ మీద పడుకో బెట్టడం వల్ల ఇలాంటి అనర్ధాలే జరుగు తాయి " అంటూ కలగూర గంప సద్దుకుంటాడు .



ఇంకొక ఆమె " అమ్మా దీని దుంప తెగ నేను వనం లో సబ్యురాలినే నాకు కూడా తెలీకుండా దుప్పట్ల పంపకమా? నా మనసులో మాట తెలుసుకోక పొతే ఎలా " అంటూ నిద్ర నటిస్తూ వుంటుంది .



ఇంకొకతను " అబ్బ యీ మొత్తం ఎపోసోడు కలిపి ''చీకట్లో చిందులాట , దుప్పట్లో దుముకులాట '' అని నా కోడికన్ను లో సమీక్ష రాసేస్తే హిట్లే హిట్లు " అనుకుంటూ వుంటాడు .



ఇంకొకాయన " పిచ్చి అజ్నానుల్లారా. గొడ్డు మాంసం తినేవాల్లకి చలి ఉండదురా గిలి తప్ప. అందికే అందరూ గొడ్డు మాంసం తినండి. పోషక విలువలు బాగా ఉంటాయి. కత్తిలా బతకొచ్చు. అయినా నాకెందుకులే. అంటే అన్నానంటారు. అనకపోతే అనలేదంటారు. ఇదంతా అగ్ర వర్ణాల అభిజాత్యం. హు. " అని మళ్ళీ నిద్రలోకి జారుకుంటాడు.



ఇవన్ని దుర్భిణి లో చుసిన రమణి కళ్ళు తిరుగు తుంటే ఆపుకుని " ఇదేమిటి స్వామి ముష్టి సాయం లో కుడా ముష్టి యుద్దాల?అంటూ విస్తు పోతుంది .



చూసావా దేవుని లీల కర్మ వశాత్తు అభాగ్యులైన విధి వంచితులకి సాయం చేద్దా మంటే బ్లాగ్ లోకపు ఊబిలో కూరుకు పోయి కర్మలను ఆచరించడం మానేసి నిరంతరం కంప్యూటర్ కి అతుక్కు పోయే విదివంచితులకి తగిన గుణ పాఠం నేర్పాడు . ఈ తెలుగు స్టాల్ లో పొద్దు పోయేదాకా పనిచేసి బ్లాగర్లు బస్సుల్లేక ఇక్కడే ఫుట్ పాత్ మీద పడుకుంటే ఆమె వచ్చి అడుక్కునే వాల్లనుకుని దుప్పట్లు కప్పి ఫోటోలు తీసేసుకుని మళ్ళీ దుప్పట్లు లాగేసుకుని అద్దె షాపు వాడికి ఇచ్చేసింది. ఇది తెలియని పిచ్చి బ్లాగర్లు భోరున కన్నీరు కారుస్తూ " త్యాగశీలి వమ్మా మహిళా తలుపు సీల వమ్మా " అని భోరున కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. " అన్నాడు కాగడా.



మీరు మాత్రం మమ్మల్ని హత్తుకుని వుండగా దుప్పట్లోకి , బ్లాగ్ మిత్రుల్ని అలా అనడం బావోలేదు నిష్టురం గా అంది రమణి .



నేను అతుకున్నా అంటుకోను .వాళ్ళు మాత్రం కంప్యూటర్ కి అంటుకుని వుంటూ వేరే కర్మలకి అతుక్కోరు అంటూ టవల్ ని పైకి లాక్కున్నాడు కాగడా.



>><< ఇది చదివి తిట్టకుండా ఊరుకున్న వారికి ఈ రాత్రికే దుప్పటి కప్పబడును.