19, డిసెంబర్ 2009, శనివారం
నాకూ నిదురించాలని వుంది .....నీతో
చలిగాలి సుడులు తిరుగుతూ
ఆలపించే వణుకుడు రాగం లో
వెచ్చేచ్చని దుప్పటి లాంటి నీ కవుగిలిలో
అంతకంటే వెచ్చని నువ్వు తెచ్చిన' రాయల్ చాలేన్జిలో '
అమ్మ షోడా పోసుకుని
నాన్న నీళ్ళే వేసుకుని
మందుకి మారు పేరు నా విందనుకుని
యెంత తాగినా ఎక్కని నా ఏదని
పలుమార్లు సేద దీర్చి ,
ఎదర డబ్బు నోట్లు వేద జల్లి
నలుపైనా నాకూ అందాన్ని అంట కట్టి
నీ ద్వార గుప్త రోగాలు వంట బట్టి
నా చెంత నిలిచే నా తోడూ కావలితో ....
మందు పారిన రేయిలో
మత్తు వదలని హాయి లో
చిత్తూ చేస్తానని వచ్చి
కనికరించని నీ మగసిరి తో
కనబడని మాయ కమ్మిన బతుకులో
నీతో పడుకున్నా పవిత్రతకి భంగం కలగని రీతిలో
నీ డబ్బులు , జబ్బులు మాత్రమె తీసుకుని
వెళ్లి పోతున్నా కన్నా నే పెళ్ళిచేసుకుని
అయినా నిదురించాలని వుంది ఆఖరి సారి నీతో
వోక్కసారన్న తృప్తి గా నిట్టురుస్తానేమో అన్న ఆశతో .
######################################
అమ్మ ,నాన్నకి , నాకూ మందు ,షోడా ,నీళ్ళు అన్ని తానై ,అడిగినంతా డబ్బులిచ్చి ,అడగకుండా జబ్బులిచ్చి ,
పవిత్రంగానే నన్ను నిలిపేసిన నా కన్నకి చెప్పిన మాట ఇది ....... ఏమి చెయ్యకుండానే యెంత దొబ్బ పెట్టాడో నే చెప్పను దిష్టి తగులుతుంది .